Logo

రూతు అధ్యాయము 2 వచనము 20

రూతు 3:10 అతడు నా కుమారీ, యెహోవాచేత నీవు దీవెన నొందినదానవు; కొద్దివారినే గాని గొప్పవారినే గాని యౌవనస్థులను నీవు వెంబడింపక యుండుటవలన నీ మునుపటి సత్‌ప్రవర్తన కంటె వెనుకటి సత్‌ప్రవర్తన మరి ఎక్కువైనది.

2సమూయేలు 2:5 సౌలును పాతిపెట్టినవారు యాబేష్గిలాదువారని దావీదు తెలిసికొని యాబేష్గిలాదువారియొద్దకు దూతలను పంపి మీరు ఉపకారము చూపి మీ యేలినవాడైన సౌలును పాతిపెట్టితిరి గనుక యెహోవా చేత మీరు ఆశీర్వచనము నొందుదురు గాక.

యోబు 29:12 ఏలయనగా మొఱ్ఱపెట్టిన దీనులను తండ్రిలేనివారిని సహాయములేనివారిని నేను విడిపించితిని.

యోబు 29:13 నశించుటకు సిద్ధమైయున్నవారి దీవెన నామీదికి వచ్చెను విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టితిని

2తిమోతి 1:16 ప్రభువు ఒనేసిఫోరు ఇంటివారియందు కనికరము చూపునుగాక.

2తిమోతి 1:17 అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంకెళ్లనుగూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి, కనుగొని, అనేక పర్యాయములు ఆదరించెను.

2తిమోతి 1:18 మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారము చేసెనో అది నీవు బాగుగా ఎరుగుదువు. ఆ దినమునందు అతడు ప్రభువువలన కనికరము పొందునట్లు ప్రభువు అనుగ్రహించును గాక.

2సమూయేలు 9:1 యోనాతానునుబట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైన కలడాయని దావీదు అడిగెను.

సామెతలు 17:17 నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును.

ఫిలిప్పీయులకు 4:10 నన్నుగూర్చి మీరిన్నాళ్లకు మరల యోచన చేయసాగితిరని ప్రభువునందు మిక్కిలి సంతోషించితిని. ఆ విషయములో మీరు యోచన చేసియుంటిరి గాని తగిన సమయము దొరకకపోయెను.

రూతు 3:9 అతడునీ వెవరవని అడుగగా ఆమె నేను రూతు అను నీ దాసురాలిని; నీవు నాకు సమీప బంధువుడవు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా

రూతు 4:6 ఆ బంధువుడు నేను దానిని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకొందునేమో, నేను దాని విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించుమని చెప్పెను.

లేవీయకాండము 25:25 నీ సహోదరుడు బీదవాడై తన స్వాస్థ్యములో కొంత అమ్మిన తరువాత అతనికి సమీప బంధువుడు విడిపింప వచ్చినయెడల తన సహోదరుడు అమ్మినదానిని అతడు విడిపించును.

ద్వితియోపదేశాకాండము 25:5 సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానములేక చనిపోయినయెడల చనిపోయిన వాని భార్య అన్యుని పెండ్లిచేసికొనకూడదు; ఆమె పెనిమిటి సహోదరుడు ఆమెయొద్దకు పోయి ఆమెను పెండ్లి చేసికొని తన సహోదరునికి మారుగా ఆమెయెడల భర్త ధర్మము జరపవలెను.

ద్వితియోపదేశాకాండము 25:6 చనిపోయిన సహోదరుని పేరు ఇశ్రాయేలీయులలోనుండి తుడిచివేయబడకుండునట్లు ఆమె కను జ్యేష్ఠకుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడుగా ఉండవలెను.

ద్వితియోపదేశాకాండము 25:7 అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహింపనొల్లనియెడల వాని సహోదరుని భార్య పట్టణపు గవినికి, అనగా పెద్దలయొద్దకు పోయి నా పెనిమిటి సహోదరుడు ఇశ్రాయేలీయులలో తన సహోదరునికి పేరు స్థాపింపనని చెప్పి దేవధర్మము చేయనొల్లడని తెలుపుకొనవలెను.

యోబు 19:25 అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమిమీద నిలుచుననియు నేనెరుగుదును.

రూతు 1:8 నయోమి తన యిద్దరు కోడండ్రను చూచి మీరు మీ తల్లుల యిండ్లకు తిరిగివెళ్లుడి; చనిపోయిన వారియెడలను నాయెడలను మీరు దయచూపినట్లు యెహోవా మీయెడల దయచూపును గాక;

రూతు 3:2 ఎవని పనికత్తెలయొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు. ఇదిగో యీ రాత్రి అతడు కళ్లమున యవలు తూర్పారబట్టింప బోవుచున్నాడు.

రూతు 3:13 ఈ రాత్రి యుండుము; ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరిపినయెడల సరి, అతడు విడిపింపవచ్చును. నీకు బంధువుని ధర్మము జరుపుటకు అతనికి ఇష్టము లేక పోయినయెడల, యెహోవా జీవము తోడు నేనే నీకు బంధువుని ధర్మము జరిపెదను; ఉదయమువరకు పండుకొనుమని చెప్పెను.

ఎఫెసీయులకు 4:32 ఒకనియెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.