Logo

రూతు అధ్యాయము 2 వచనము 23

సామెతలు 6:6 సోమరీ, చీమల యొద్దకు వెళ్లుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము.

సామెతలు 6:7 వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను

సామెతలు 6:8 అవి వేసవికాలమందు ఆహారము సిద్ధపరచుకొనును కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును.

సామెతలు 13:1 తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును. అపహాసకుడు గద్దింపునకు లోబడడు.

సామెతలు 13:20 జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.

1కొరిందీయులకు 15:33 మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును.

ఎఫెసీయులకు 6:1 పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు విధేయులై యుండుడి; ఇది ధర్మమే.

ఎఫెసీయులకు 6:2 నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము,

ఎఫెసీయులకు 6:3 అప్పుడు నీవు భూమిమీద దీర్ఘాయుష్మంతుడవగువుదు, ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది.

నిర్గమకాండము 9:31 అప్పుడు జనుపచెట్లు పువ్వులు పూసెను, యవలచేలు వెన్నులు వేసినవి గనుక జనుప యవలచేలును చెడగొట్టబడెను గాని

రూతు 1:22 అట్లు నయోమియు ఆమెతోకూడ మోయాబీయురాలైన రూతు అను ఆమె కోడలును మోయాబు దేశమునుండి తిరిగి వచ్చిరి. వారిద్దరు యవల కోత ఆరంభములో బేత్లెహేము చేరిరి.

రూతు 2:21 మోయాబీయురాలైన రూతు అంతేకాదు, అతడు నన్ను చూచి, తనకు కలిగిన పంటకోత అంతయు ముగించువరకు తన పని వారియొద్ద నిలకడగా ఉండుమని నాతో చెప్పెననెను.

రూతు 3:2 ఎవని పనికత్తెలయొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు. ఇదిగో యీ రాత్రి అతడు కళ్లమున యవలు తూర్పారబట్టింప బోవుచున్నాడు.

సామెతలు 31:13 ఆమె గొఱ్ఱబొచ్చును అవిసెనారను వెదకును తన చేతులార వాటితో పనిచేయును.