Logo

రూతు అధ్యాయము 4 వచనము 11

ఆదికాండము 24:60 వారు రిబ్కాతో మా సహోదరీ, నీవు వేలవేలకు తల్లివగుదువు గాక, నీ సంతతివారు తమ పగవారి గవినిని స్వాధీనపరచుకొందురు గాక అని ఆమెను దీవింపగా

కీర్తనలు 127:3 కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన యిచ్చు బహుమానమే

కీర్తనలు 127:4 యౌవనకాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములవంటివారు.

కీర్తనలు 127:5 వారితో తన అంబులపొది నింపుకొనినవాడు ధన్యుడు అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు.

కీర్తనలు 128:3 నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లివలె నుండును నీ భోజనపు బల్లచుట్టు నీ పిల్లలు ఒలీవ మొక్కలవలె నుందురు.

కీర్తనలు 128:4 యెహోవాయందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును.

కీర్తనలు 128:5 సీయోనులోనుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు

కీర్తనలు 128:6 నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలుమీద సమాధానముండును గాక.

ఆదికాండము 29:32 లేయా గర్భవతియై కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచియున్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టెను.

ఆదికాండము 29:33 ఆమె మరల గర్భవతియై కుమారుని కని నేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతని కూడ నాకు దయచేసెననుకొని అతనికి షిమ్యోను అను పేరు పెట్టెను.

ఆదికాండము 29:34 ఆమె మరల గర్భవతియై కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని యుండును; అతనికి ముగ్గురు కుమారులను కంటిననుకొనెను. అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను

ఆదికాండము 29:35 ఆమె మరల గర్భవతియై కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదననుకొని యూదా అను పేరు పెట్టెను. అప్పుడామెకు కానుపు ఉడిగెను.

ఆదికాండము 30:1 రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనక పోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము; లేనియెడల నేను చచ్చెదననెను.

ఆదికాండము 30:2 యాకోబు కోపము రాహేలుమీద రగులుకొనగా అతడు నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయిన దేవునికి ప్రతిగా నున్నానా అనెను.

ఆదికాండము 30:3 అందుకామె నా దాసియైన బిల్హా ఉన్నది గదా; ఆమెతో పొమ్ము; ఆమె నా కొరకు పిల్లలను కనును; ఆలాగున ఆమెవలన నాకును పిల్లలు కలుగుదురని చెప్పి

ఆదికాండము 30:4 తన దాసియైన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చెను. యాకోబు ఆమెతో పోగా

ఆదికాండము 30:5 బిల్హా గర్భవతియై యాకోబునకు కుమారుని కనెను.

ఆదికాండము 30:6 అప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పుతీర్చెను; ఆయన నా మొరను విని నాకు కుమారుని దయచేసెననుకొని అతనికి దాను అని పేరు పెట్టెను.

ఆదికాండము 30:7 రాహేలు దాసియైన బిల్హా తిరిగి గర్భవతియై యాకోబుకు రెండవ కుమారుని కనెను.

ఆదికాండము 30:8 అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిననుకొని అతనికి నఫ్తాలి అను పేరు పెట్టెను.

ఆదికాండము 30:9 లేయా తనకు కానుపు ఉడుగుట చూచి తన దాసియైన జిల్పాను తీసికొని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చెను.

ఆదికాండము 30:10 లేయా దాసియైన జిల్పా యాకోబునకు కుమారుని కనగా

ఆదికాండము 30:11 లేయా ఇది అదృష్టమేగదా అనుకొని అతనికి గాదు అను పేరు పెట్టెను.

ఆదికాండము 30:12 లేయా దాసియైన జిల్పా యాకోబునకు రెండవ కుమారుని కనగా

ఆదికాండము 30:13 లేయా నేను భాగ్యవంతురాలను స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు గదా అని అతనికి ఆషేరు అను పేరు పెట్టెను.

ఆదికాండము 30:14 గోధుమల కోతకాలములో రూబేను వెళ్లి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లియైన లేయాకు తెచ్చి యిచ్చెను. అప్పుడు రాహేలు నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయుమని లేయాతో అనగా

ఆదికాండము 30:15 ఆమెనా భర్తను తీసికొంటివే అది చాలదా? ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసికొందువా అని చెప్పెను. అందుకు రాహేలు కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించునని చెప్పెను.

ఆదికాండము 30:16 సాయంకాలమందు యాకోబు పొలమునుండి వచ్చునప్పుడు లేయా అతనిని ఎదుర్కొనబోయి నీవు నాయొద్దకు రావలెను, నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పెను. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించెను.

ఆదికాండము 30:17 దేవుడు లేయా మనవి వినెను గనుక ఆమె గర్భవతియై యాకోబునకు అయిదవ కుమారుని కనెను.

ఆదికాండము 30:18 లేయా నేను నా పెనిమిటికి నా దాసి నిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసెననుకొని అతనికి ఇశ్శాఖారు అను పేరు పెట్టెను.

ఆదికాండము 30:19 లేయా మరల గర్భవతియై యాకోబునకు ఆరవ కుమారుని కనెను.

ఆదికాండము 30:20 అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను; నా పెనిమిటికి ఆరుగురు కుమారులను కనియున్నాను గనుక అతడికను నాతో కాపురము చేయుననుకొని అతనికి జెబూలూను అను పేరు పెట్టెను

ఆదికాండము 30:21 ఆ తరువాత ఆమె కొమార్తెను కని ఆమెకు దీనా అను పేరు పెట్టెను.

ఆదికాండము 30:22 దేవుడు రాహేలును జ్ఞాపకము చేసికొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను.

ఆదికాండము 30:23 అప్పుడామె గర్భవతియై కుమారుని కనిదేవుడు నా నింద తొలగించెననుకొనెను.

ఆదికాండము 30:24 మరియు ఆమె--యెహోవా మరియొక కుమారుని నాకు దయచేయును గాక అనుకొని అతనికి యోసేపు అను పేరు పెట్టెను.

ఆదికాండము 35:16 ఎఫ్రాతాకు వెళ్లు మార్గములో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవవేదనతో ప్రయాసపడెను.

ఆదికాండము 35:17 ఆమె ప్రసవమువలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకుము; ఇదియు నీకు కుమారుడగునని చెప్పెను.

ఆదికాండము 35:18 ఆమె మృతిబొందెను; ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను; అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టెను.

ఆదికాండము 35:19 అట్లు రాహేలు మృతిబొంది బేత్లెహేమను ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను.

ఆదికాండము 35:20 యాకోబు ఆమె సమాధిమీద ఒక స్తంభము కట్టించెను. అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము.

ఆదికాండము 46:8 యాకోబును అతని కుమారులును ఐగుప్తునకు వచ్చిరి. ఇశ్రాయేలు కుమారుల పేళ్లు ఇవే;

ఆదికాండము 46:9 యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను. రూబేను కుమారులైన హనోకు పల్లు హెస్రోను కర్మీ.

ఆదికాండము 46:10 షిమ్యోను కుమారులైన యెమూయేలు యామీను ఓహదు యాకీను సోహరు కనానీయు రాలి కుమారుడైన షావూలు.

ఆదికాండము 46:11 లేవి కుమారులైన గెర్షోను కహాతు మెరారి

ఆదికాండము 46:12 యూదా కుమారులైన ఏరు ఓనాను షేలా పెరెసు జెరహు. ఆ ఏరును ఓనానును కనాను దేశములో చనిపోయిరి. పెరెసు కుమారులైన హెస్రోను హామూలు.

ఆదికాండము 46:13 ఇశ్శాఖారు కుమారులైన తోలా పువ్వా యోబు షిమ్రోను.

ఆదికాండము 46:14 జెబూలూను కుమారులైన సెరెదు ఏలోను యహలేలు.

ఆదికాండము 46:15 వీరు లేయా కుమారులు. ఆమె పద్దనరాములో యాకోబు వారిని అతని కుమార్తెయైన దీనాను కనెను. అతని కుమారులును అతని కుమార్తెలును అందరును ముప్పది ముగ్గురు.

ఆదికాండము 46:16 గాదు కుమారులైన సిప్యోను హగ్గీ షూనీ ఎస్బోను ఏరీ ఆరోదీ అరేలీ.

ఆదికాండము 46:17 ఆషేరు కుమారులైన ఇమ్నా ఇష్వా ఇష్వీ బెరీయా; వారి సహోదరియైన శెరహు. ఆ బెరీయా కుమారులైన హెబెరు మల్కీయేలు.

ఆదికాండము 46:18 లాబాను తన కుమార్తెయైన లేయాకిచ్చిన జిల్పా కుమారులు వీరే. ఆమె యీ పదునారు మందిని యాకోబునకు కనెను.

ఆదికాండము 46:19 యాకోబు భార్యయైన రాహేలు కుమారులైన యోసేపు బెన్యామీను.

ఆదికాండము 46:20 యోసేపునకు మనష్షే ఎఫ్రాయిములు పుట్టిరి. వారిని ఐగుప్తుదేశమందు ఓనుకు యాజకుడగు పోతీఫెర కుమార్తెయైన ఆసెనతు అతనికి కనెను.

ఆదికాండము 46:21 బెన్యామీను కుమారులైన బెల బేకెరు అష్బేలు గెరా నయమాను ఏహీరోషు ముప్పీము హుప్పీము ఆర్దు.

ఆదికాండము 46:22 యాకోబునకు రాహేలు కనిన కుమారులగు వీరందరు పదునలుగురు.

ఆదికాండము 46:23 దాను కుమారుడైన హుషీము.

ఆదికాండము 46:24 నఫ్తాలి కుమారులైన యహనేలు గూనీ యేసెరు షిల్లేము.

ఆదికాండము 46:25 లాబాను తన కుమార్తెయైన రాహేలునకు ఇచ్చిన బిల్హా కుమారులు వీరే. ఆమె వారిని యాకోబునకు కనెను. వారందరు ఏడుగురు.

ఆదికాండము 46:26 యాకోబు కోడండ్రను వినాయించి అతని గర్భవాసమున పుట్టి యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరు అరువది ఆరుగురు.

ఆదికాండము 46:27 ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరు; ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరు డెబ్బది మంది.

సంఖ్యాకాండము 26:1 ఆ తెగులు పోయిన తర్వాత యెహోవా మోషేకును యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరుకును ఈలాగు సెలవిచ్చెను

సంఖ్యాకాండము 26:2 మీరు ఇశ్రాయేలీయుల సర్వసమాజములోను ఇరువది ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి ఇశ్రాయేలీయులలో సేనగా బయలువెళ్లువారందరి సంఖ్యను వారి వారి పితరుల కుటుంబములనుబట్టి వ్రాయించుడి.

సంఖ్యాకాండము 26:3 కాబట్టి యిరువది ఏండ్లు మొదలుకొని పై ప్రాయము గలవారిని లెక్కింపుడని యెహోవా మోషేకును ఐగుప్తు దేశమునుండి వచ్చిన ఇశ్రాయేలీయులకును ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడగు ఎలియాజరును ఇశ్రాయేలీయులు

సంఖ్యాకాండము 26:4 మోయాబు మైదానములలో యెరికోయొద్దనున్న యొర్దాను దగ్గరనుండగా జనసంఖ్యను చేయుడని వారితో చెప్పిరి.

సంఖ్యాకాండము 26:5 ఇశ్రాయేలు తొలిచూలు రూబేను. రూబేను పుత్రులలో హనోకీయులు హనోకు వంశస్థులు;

సంఖ్యాకాండము 26:6 పల్లువీయులు పల్లు వంశస్థులు; హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు; కర్మీయులు కర్మీ వంశస్థులు;

సంఖ్యాకాండము 26:7 వీరు రూబేనీయుల వంశస్థులు, వారిలో లెక్కింపబడినవారు నలుబది మూడువేల ఏడువందల ముప్పదిమంది.

సంఖ్యాకాండము 26:8 పల్లు కుమారుడు ఏలీయాబు. ఏలీయాబు కుమారులు నెమూయేలు దాతాను అబీరాము.

సంఖ్యాకాండము 26:9 కోరహు తన సమూహములో పేరుపొందినవాడు; అతని సమాజము యెహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజములో మోషే అహరోనులకు విరోధముగా వాదించిన దాతాను అబీరాములు వీరు.

సంఖ్యాకాండము 26:10 ఆ సమూహపువారు మృతిబొందినప్పుడు అగ్ని రెండువందల ఏబదిమందిని భక్షించినందునను, భూమి తన నోరుతెరచి వారిని కోరహును మింగివేసినందునను, వారు దృష్టాంతములైరి.

సంఖ్యాకాండము 26:11 అయితే కోరహు కుమారులు చావలేదు.

సంఖ్యాకాండము 26:12 షిమ్యోను పుత్రుల వంశములలో నెమూయేలీయులు నెమూయేలు వంశస్థులు; యామీనీయులు యామీను వంశస్థులు; యాకీనీయులు యాకీను వంశస్థులు;

సంఖ్యాకాండము 26:13 జెరహీయులు జెరహు వంశస్థులు; షావూలీయులు షావూలు వంశస్థులు.

సంఖ్యాకాండము 26:14 ఇవి షిమ్యోనీయుల వంశములు. వారు ఇరువది రెండువేల రెండువందలమంది.

సంఖ్యాకాండము 26:15 గాదు పుత్రుల వంశములలో సెపోనీయులు సెపోను వంశస్థులు; హగ్గీయులు హగ్గీ వంశస్థులు; షూనీయులు షూనీ వంశస్థులు,

సంఖ్యాకాండము 26:16 ఓజనీయులు ఓజని వంశస్థులు; ఏరీయులు ఏరీ వంశస్థులు;

సంఖ్యాకాండము 26:17 ఆరోదీయులు ఆరోదు వంశస్థులు; అరేలీయులు అరేలీ వంశస్థులు.

సంఖ్యాకాండము 26:18 వీరు గాదీయుల వంశస్థులు; వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు నలుబదివేల ఐదువందలమంది.

సంఖ్యాకాండము 26:19 యూదా కుమారులు ఏరు ఓనాను; ఏరును ఓనానును కనాను దేశములో మృతిబొందిరి.

సంఖ్యాకాండము 26:20 యూదావారి వంశములలో షేలాహీయులు షేలా వంశస్థులు; పెరెసీయులు పెరెసు వంశస్థులు జెరహీయులు జెరహు వంశస్థులు;

సంఖ్యాకాండము 26:21 పెరెసీయులలో హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు హామూలీయులు హామూలు వంశస్థులు

సంఖ్యాకాండము 26:22 వీరు యూదీయుల వంశస్థులు; వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు డెబ్బదియారువేల ఐదువందలమంది.

సంఖ్యాకాండము 26:23 ఇశ్శాఖారు పుత్రుల వంశస్థులలో తోలా హీయులు తోలావంశస్థులు; పువ్వీయులు పువ్వా వంశస్థులు; యాషూబీయులు యాషూబు వంశస్థులు; షిమ్రోనీయులు షిమ్రోను వంశస్థులు; వీరు ఇశ్శాఖారీయుల వంశస్థులు.

సంఖ్యాకాండము 26:24 వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు అరువది నాలుగువేల మూడువందలమంది.

సంఖ్యాకాండము 26:25 జెబూలూను పుత్రుల వంశస్థులలో సెరెదీయులు సెరెదు వంశస్థులు;

సంఖ్యాకాండము 26:26 ఏలోనీయులు ఏలోను వంశస్థులు; యహలేలీయులు యహలేలు వంశస్థులు;

సంఖ్యాకాండము 26:27 వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు అరువదివేల ఐదువందలమంది.

సంఖ్యాకాండము 26:28 యోసేపు పుత్రుల వంశస్థులు అతని కుమారులు మనష్షే ఎఫ్రాయిము.

సంఖ్యాకాండము 26:29 మనష్షే కుమారులలో మాకీరీయులు మాకీరు వంశస్థులు; మాకీరు గిలాదును కనెను; గిలాదీయులు గిలాదు వంశస్థులు; వీరు గిలాదు పుత్రులు.

సంఖ్యాకాండము 26:30 ఈజరీయులు ఈజరు వంశస్థులు; హెలకీయులు హెలకు వంశస్థులు;

సంఖ్యాకాండము 26:31 అశ్రీయేలీయులు అశ్రీయేలు వంశస్థులు; షెకెమీయులు షెకెము వంశస్థులు;

సంఖ్యాకాండము 26:32 షెమీదాయీయులు షెమీదా వంశస్థులు; హెపెరీయులు హెపెరు వంశస్థులు.

సంఖ్యాకాండము 26:33 హెపెరు కుమారుడైన సెలోపెహాదుకు కుమార్తెలేగాని కుమారులు పుట్టలేదు. సెలోపెహాదు కుమార్తెల పేరులు మహలా నోయా హొగ్లా మిల్కా తిర్సా.

సంఖ్యాకాండము 26:34 వీరు మనష్షీయుల వంశస్థులు; వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు ఏబది రెండువేల ఏడువందలమంది.

సంఖ్యాకాండము 26:35 ఎఫ్రాయిము పుత్రుల వంశములు ఇవి; షూతలహీయులు షూతలహు వంశస్థులు; బేకరీయులు బేకరు వంశస్థులు; తహనీయులు తహను వంశస్థులు,

సంఖ్యాకాండము 26:36 వీరు షూతలహు కుమారులు; ఏరానీయులు ఏరాను వంశస్థులు.

సంఖ్యాకాండము 26:37 వీరు ఎఫ్రాయిమీయుల వంశస్థులు. వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు ముప్పది రెండువేల ఐదువందలమంది; వీరు యోసేపు పుత్రుల వంశస్థులు.

సంఖ్యాకాండము 26:38 బెన్యామీను పుత్రుల వంశములలో బెలీయులు బెల వంశస్థులు; అష్బేలీయులు అష్బేల వంశస్థులు;

సంఖ్యాకాండము 26:39 అహీరామీయులు అహీరాము వంశస్థులు;

సంఖ్యాకాండము 26:40 షూపామీయులు షూపాము వంశస్థులు; బెల కుమారులు ఆర్దు నయమాను; ఆర్దీయులు ఆర్దు వంశస్థులు; నయమానీయులు నయమాను వంశస్థులు.

సంఖ్యాకాండము 26:41 వీరు బెన్యామీనీయుల వంశస్థులు; వారిలో వ్రాయబడిన లెక్కచొప్పున నలుబది యయిదువేల ఆరువందలమంది.

సంఖ్యాకాండము 26:42 దాను పుత్రుల వంశములలో షూషామీయులు షూషాము వంశస్థులు;

సంఖ్యాకాండము 26:43 వీరు తమ వంశములలో దానీయుల వంశస్థులు. వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు అరువది నాలుగువేల నాలుగువందలమంది.

సంఖ్యాకాండము 26:44 ఆషేరు పుత్రుల వంశములలో యిమ్నీయులు యిమ్నా వంశస్థులు, ఇష్వీయులు ఇష్వీ వంశస్థులు; బెరీయులు బెరీయా వంశస్థులు;

సంఖ్యాకాండము 26:45 బెరీయానీయులలో హెబెరీయులు హెబెరు వంశస్థులు; మల్కీయేలీయులు మల్కీయేలు వంశస్థులు;

సంఖ్యాకాండము 26:46 ఆషేరు కుమార్తె పేరు శెరహు.

సంఖ్యాకాండము 26:47 వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు ఆషేరీయుల వంశస్థులు; వీరు ఏబది మూడువేల నాలుగువందలమంది.

సంఖ్యాకాండము 26:48 నఫ్తాలీ పుత్రుల వంశములలో యహసయేలీయులు యహసయేలు వంశస్థులు; గూనీయులు గూనీ వంశస్థులు;

సంఖ్యాకాండము 26:49 యేసెరీయులు యేసెరు వంశస్థులు; షిల్లేమీయులు షిల్లేము వంశస్థులు.

సంఖ్యాకాండము 26:50 వీరు నఫ్తాలీయుల వంశస్థులు; వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు నలుబది యయిదువేల నాలుగువందలమంది

సంఖ్యాకాండము 26:51 ఇశ్రాయేలీయులలో లెక్కింపబడిన వీరు ఆరులక్షల వెయ్యిన్ని ఏడువందల ముప్పదిమంది.

సంఖ్యాకాండము 26:52 యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను వీరి పేళ్ల లెక్కచొప్పున ఆ దేశమును వీరికి స్వాస్థ్యముగా పంచిపెట్టవలెను.

సంఖ్యాకాండము 26:53 ఎక్కువమందికి ఎక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను;

సంఖ్యాకాండము 26:54 తక్కువమందికి తక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను. దాని దాని జనసంఖ్యనుబట్టి ఆ యా గోత్రములకు స్వాస్థ్యము ఇయ్యవలెను.

సంఖ్యాకాండము 26:55 చీట్లువేసి ఆ భూమిని పంచిపెట్టవలెను. వారు తమ తమ పితరుల గోత్రముల జనసంఖ్యచొప్పున స్వాస్థ్యమును పొందవలెను.

సంఖ్యాకాండము 26:56 ఎక్కువమందికేమి తక్కువమందికేమి చీట్లువేసి యెవరి స్వాస్థ్యమును వారికి పంచిపెట్టవలెను.

సంఖ్యాకాండము 26:57 వారివారి వంశములలో లెక్కింపబడిన లేవీయులు వీరు. గెర్షోనీయులు గెర్షోను వంశస్థులు; కహాతీయులు కహాతు వంశస్థులు; మెరారీయులు మెరారి వంశస్థులు.

సంఖ్యాకాండము 26:58 లేవీయుల వంశములు ఏవనగా, లిబ్నీయుల వంశము హెబ్రోనీయుల వంశము మహలీయుల వంశము మూషీయుల వంశము కోరహీయుల వంశము.

సంఖ్యాకాండము 26:59 కహాతు అమ్రామును కనెను; అమ్రాము భార్యపేరు యోకెబెదు. ఆమె లేవీ కుమార్తె; ఐగుప్తులో ఆమె లేవీకి పుట్టెను. ఆమె అమ్రామువలన అహరోనును మోషేను వీరి సహోదరియగు మిర్యామును కనెను.

సంఖ్యాకాండము 26:60 అహరోనువలన నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు పుట్టిరి.

సంఖ్యాకాండము 26:61 నాదాబు అబీహులు యెహోవా సన్నిధికి అన్యాగ్ని తెచ్చినప్పుడు చనిపోయిరి.

సంఖ్యాకాండము 26:62 వారిలో నెల మొదలుకొని పై ప్రాయము కలిగి లెక్కింపబడినవారందరు ఇరువది మూడువేలమంది. వారు ఇశ్రాయేలీయులలో లెక్కింపబడినవారు కారుగనుక ఇశ్రాయేలీయులలో వారికి స్వాస్థ్యమియ్యబడలేదు.

సంఖ్యాకాండము 26:63 యెరికో ప్రాంతములయందలి యొర్దానునొద్దనున్న మోయాబు మైదానములలో మోషేయు యాజకుడగు ఎలియాజరును ఇశ్రాయేలీయుల జనసంఖ్య చేసినప్పుడు లెక్కింపబడినవారు వీరు.

సంఖ్యాకాండము 26:64 మోషే అహరోనులు సీనాయి అరణ్యములో ఇశ్రాయేలీయుల సంఖ్యను చేసినప్పుడు లెక్కింపబడినవారిలో ఒక్కడైనను వీరిలో ఉండలేదు.

సంఖ్యాకాండము 26:65 ఏలయనగా వారు నిశ్చయముగా అరణ్యములో చనిపోవుదురని యెహోవా వారినిగూర్చి సెలవిచ్చెను. యెపున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలియుండలేదు.

ద్వితియోపదేశాకాండము 25:9 ఆ పెద్దలు చూచుచుండగా, అతని దాపున పోయి అతని కాలినుండి చెప్పు ఊడదీసి అతని ముఖము నెదుట ఉమ్మివేసి తన సహోదరుని యిల్లు నిలుపని మనుష్యునికి ఈలాగు చేయబడునని చెప్పవలెను.

సామెతలు 14:1 జ్ఞానవంతురాలు తన యిల్లు కట్టును మూఢురాలు తనచేతులతో తన యిల్లు ఊడబెరుకును.

రూతు 1:2 ఆ మనుష్యుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి; అతని యిద్దరు కుమారుల పేళ్లు మహ్లోను కిల్యోను; వారు యూదా బేత్లెహేము వారైన ఎఫ్రాతీయులు; వారు మోయాబు దేశమునకు వెళ్లి అక్కడ కాపురముండిరి.

ఆదికాండము 35:16 ఎఫ్రాతాకు వెళ్లు మార్గములో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవవేదనతో ప్రయాసపడెను.

ఆదికాండము 35:19 అట్లు రాహేలు మృతిబొంది బేత్లెహేమను ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను.

కీర్తనలు 132:6 అది ఎఫ్రాతాలోనున్నదని మేము వింటిమి యాయరు పొలములలో అది దొరికెను.

మీకా 5:2 బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనను నాకొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును; పురాతనకాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను.

మత్తయి 2:6 అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి,

ఆదికాండము 16:2 కాగా శారయి ఇదిగో నేను పిల్లలు కనకుండ యెహోవా చేసియున్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము; ఒకవేళ ఆమెవలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాముతో చెప్పెను; అబ్రాము శారయి మాట వినెను.

ఆదికాండము 23:11 అయ్యా అట్లు కాదు నా మనవి నాలకించుము, ఆ పొలమును నీకిచ్చుచున్నాను; దానిలోనున్న గుహను నీకిచ్చుచున్నాను; నా ప్రజల యెదుట అది నీకిచ్చుచున్నాను; మృతిబొందిన నీ భార్యను పాతిపెట్టుమనెను

ఆదికాండము 29:16 లాబాను కిద్దరు కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా; చిన్నదాని పేరు రాహేలు.

ఆదికాండము 30:3 అందుకామె నా దాసియైన బిల్హా ఉన్నది గదా; ఆమెతో పొమ్ము; ఆమె నా కొరకు పిల్లలను కనును; ఆలాగున ఆమెవలన నాకును పిల్లలు కలుగుదురని చెప్పి

ఆదికాండము 31:14 అందుకు రాహేలును లేయాయు యింక మా తండ్రి యింట మాకు పాలుపంపులెక్కడివి? అతడు మమ్మును అన్యులుగా చూచుట లేదా?

ఆదికాండము 48:9 యోసేపు వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నా కనుగ్రహించెనని తన తండ్రితో చెప్పెను. అందుకతడు నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసికొని రమ్మనెను.

ఆదికాండము 48:19 అయినను అతని తండ్రి ఒప్పక అది నాకు తెలియును, నా కుమారుడా అది నాకు తెలియును; ఇతడును ఒక జన సమూహమై గొప్పవాడగును గాని యితని తమ్ముడు ఇతని కంటె గొప్పవాడగును, అతని సంతానము జనముల సమూహమగునని చెప్పెను

ఆదికాండము 48:20 ఆ దినమందు అతడు వారిని దీవించి ఎఫ్రాయిము వలెను మనష్షే వలెను దేవుడు నిన్ను చేయును గాకని ఇశ్రాయేలీయులు నీ పేరు చెప్పి దీవించెదరనెను. ఆలాగు అతడు మనష్షేకంటె ఎఫ్రాయిమును ముందుగా ఉంచెను.

ద్వితియోపదేశాకాండము 6:7 నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను; సూచనగా వాటిని నీచేతికి కట్టుకొనవలెను.

రూతు 2:4 బోయజు బేత్లెహేమునుండి వచ్చి యెహోవా మీకు తోడై యుండును గాకని చేను కోయువారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాకనిరి.

1సమూయేలు 2:20 యెహోవా సన్నిధిని మనవి చేసికొనగా నీకు దొరకిన యీ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానము నిచ్చునుగాక అని ఏలీ ఎల్కానాను అతని భార్యను దీవించిన తరువాత వారు ఇంటికి వెళ్లిరి.

1దినవృత్తాంతములు 2:51 బేత్లెహేము తండ్రియైన శల్మాయును, బేత్గాదేరు తండ్రియైన హారేపును.

యోబు 29:7 పట్టణపు గుమ్మమునకు నేను వెళ్లినప్పుడు రాజవీధిలో నా పీఠము సిద్ధపరచుకొనినప్పుడు

యెషయా 8:2 నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యము పలుకుటకు యాజకుడైన ఊరియాను యెబెరెక్యాయు కుమారుడైన జెకర్యాను సాక్షులనుగా పెట్టెదనని నాతో చెప్పగా

యిర్మియా 29:22 ఆలకించుడి, వారు ఇశ్రాయేలీయులలో దుర్మార్గము జరిగించుచు, తమ పొరుగువారి భార్యలతో వ్యభిచరించుచు, నేను వారి కాజ్ఞాపింపని అబద్ధపు మాటలను నా నామమునుబట్టి ప్రకటించుచు వచ్చిరి, నేనే యీ సంగతిని తెలిసికొనినవాడనై సాక్షిగానున్నాను. కాగా బబులోనురాజైన నెబుకద్రెజరుచేతికి వారిని అప్పగించుచున్నాను, మీరు చూచుచుండగా అతడు వారిని హతము చేయును;

జెకర్యా 8:13 యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్యజనులలో నేలాగు శాపాస్పదమై యుంటిరో ఆలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును; భయపడక ధైర్యము తెచ్చుకొనుడి.

మత్తయి 2:5 అందుకు వారు యూదయ బేత్లెహేములోనే; ఏలయనగా యూదయ దేశపు బేత్లెహేమా నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైనదానవు కావు;ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలోనుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి యున్నదనిరి

లూకా 2:4 యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక, తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతియై యుండిన మరియతో కూడ ఆ సంఖ్యలో వ్రాయ బడుటకు