Logo

రూతు అధ్యాయము 4 వచనము 17

లూకా 1:58 అప్పుడు ప్రభువు ఆమెమీద మహా కనికరముంచెనని ఆమె పొరుగువారును బంధువులును విని ఆమెతో కూడ సంతోషించిరి.

లూకా 1:59 ఎనిమిదవ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి, తండ్రి పేరును బట్టి జెకర్యా అను పేరు వానికి పెట్టబోవుచుండగా

లూకా 1:60 తల్లి ఆలాగు వద్దు; వానికి యోహానను పేరు పెట్టవలెనని చెప్పెను.

లూకా 1:61 అందుకు వారు నీ బంధువులలో ఆ పేరు గలవాడెవడును లేడే అని ఆమెతో చెప్పి

లూకా 1:62 వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సంజ్ఞలు చేసి అడిగిరి.

లూకా 1:63 అతడు వ్రాతపలక తెమ్మని వాని పేరు యోహానని వ్రాసెను; అందుకు వారందరు ఆశ్చర్యపడిరి.

రూతు 4:15 నిన్ను ప్రేమించి యేడుగురు కుమారులకంటె నీకెక్కువగా నున్న నీ కోడలు ఇతని కనెను; ఇతడు నీ ప్రాణము నోదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి.

1సమూయేలు 22:3 తరువాత దావీదు అక్కడనుండి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి దేవుడు నాకు ఏమి చేయునది నేను తెలిసికొనువరకు నా తలిదండ్రులు వచ్చి నీయొద్ద నుండనిమ్మని మోయాబు రాజుతో మనవిచేసి

1దినవృత్తాంతములు 2:37 జాబాదు ఎప్లాలును కనెను, ఎప్లాలు ఓబేదును కనెను,

కీర్తనలు 78:68 యూదా గోత్రమును తాను ప్రేమించిన సీయోను పర్వతమును ఆయన కోరుకొనెను.

యెషయా 11:1 యెష్షయి మొద్దునుండి చిగురు పుట్టును వాని వేరులనుండి అంకురము ఎదిగి ఫలించును

లూకా 2:4 యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక, తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతియై యుండిన మరియతో కూడ ఆ సంఖ్యలో వ్రాయ బడుటకు