లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 15: 9

క్రాస్-రిఫరెన్స్‌లు

" హెబ్రోను సంతతివారి కధిపతియగు ఎలీయేలును వాని బంధువులలో ఎనుబది మందిని"

సంబంధిత రిఫరెన్స్‌లు

1దినవృత్తాంతములు 6:2

కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు.

1దినవృత్తాంతములు 23:12

కహాతు కుమారులు నలుగురు, అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు.

1దినవృత్తాంతములు 23:19

హెబ్రోను కుమారులలో యెరీయా పెద్దవాడు, అమర్యా రెండవవాడు, యహజీయేలు మూడవవాడు, యెక్మెయాము నాలుగవవాడు.

1దినవృత్తాంతములు 26:23

అమ్రామీయులు ఇస్హారీయులు హెబ్రోనీయులు ఉజ్జీయేలీయులు అనువారిని గూర్చినది.

1దినవృత్తాంతములు 26:30

హెబ్రోనీయులను గూర్చినది. హషబ్యాయును వాని సహోదరులును పరాక్రమశాలులును వేయిన్ని యేడువందల సంఖ్య గలవారు, వీరు యొర్దాను ఈవల పడమటివైపుననుండు ఇశ్రాయేలీయుల మీద యెహోవా సేవనుగూర్చిన వాటన్నిటి విషయములోను రాజు నియమించిన పని విషయములోను పైవిచారణకర్తలుగా నియమింపబడిరి.

1దినవృత్తాంతములు 26:31

హెబ్రోనీయులను గూర్చినది. హెబ్రోనీయుల పితరుల యింటిపెద్దలందరికి యెరీయా పెద్దయాయెను. దావీదు ఏలుబడిలో నలువదియవ సంవత్సరమున వారి సంగతి విచారింపగా వారిలో గిలాదు దేశములోని యాజేరునందున్న వారు పరాక్రమశాలులుగా కనబడిరి.

నిర్గమకాండము 6:18

కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు. కహాతు నూట ముప్పది మూడేండ్లు బ్రదికెను.

సంఖ్యాకాండము 26:58

లేవీయుల వంశములు ఏవనగా, లిబ్నీయుల వంశము హెబ్రోనీయుల వంశము మహలీయుల వంశము మూషీయుల వంశము కోరహీయుల వంశము.