1దినవృత్తాంతములు 8: 40
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఊలాము కుమారులు విలువిద్యయందు ప్రవీణులైన పరాక్రమశాలులు; వీరికి నూట యేబదిమంది కుమారులును కుమారుల కుమారులును కలిగిరి; వీరందరును బెన్యామీనీయులు."
సంబంధిత రిఫరెన్స్‌లు
వీరు విలుకాండ్రయి కుడి యెడమ చేతులతో వడిసెలచేత రాళ్లు రువ్వుటకును వింటిచేత అంబులు విడుచుటకును సమర్థులైనవారు.
ఆ కాలమున డాళ్లను ఈటెలను పట్టుకొను మూడు లక్షలమంది యూదావారును, కేడెములు ధరించి విల్లువేయు రెండు లక్షల ఎనుబది వేలమంది బెన్యామీనీయులును కూడిన సైన్యము ఆసాకు ఉండెను; వీరందరును పరాక్రమశాలులై యుండిరి.
కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన యిచ్చు బహుమానమే
యౌవనకాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములవంటివారు.
వారితో తన అంబులపొది నింపుకొనినవాడు ధన్యుడు అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు.
నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లివలె నుండును నీ భోజనపు బల్లచుట్టు నీ పిల్లలు ఒలీవ మొక్కలవలె నుందురు.
యెహోవాయందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును.
సీయోనులోనుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు
నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలుమీద సమాధానముండును గాక.
అందుకు వారు నీ దాసులమైన మేము పండ్రెండుమంది సహోదరులము, కనాను దేశములో నున్న ఒక్క మనుష్యుని కుమారులము; ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రియొద్ద ఉన్నాడు; ఒకడు లెడు అని ఉత్తరమిచ్చిరి
రూబేనీయులలోను గాదీయులలోను మనష్షే అర్ధగోత్రమువారిలోను బల్లెమును ఖడ్గమును ధరించుటకును అంబు వేయుటకును నేర్చినవారు, యుద్ధమందు నేర్పరులై దండుకు పోతగినవారు నలువది నాలుగువేల ఏడువందల అరువదిమంది యుండిరి.