1రాజులు 2: 11
క్రాస్-రిఫరెన్స్‌లు
" దావీదు ఇశ్రాయేలీయులను ఏలిన కాలము నలువది సంవత్సరములు, హెబ్రోనులో అతడు ఏడు సంవత్సరములును యెరూషలేములో ముప్పది మూడు సంవత్సరములును ఏలెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
దావీదు ముప్పది యేండ్లవాడై యేలనారంభించి నలువది సంవత్సరములు పరిపాలన చేసెను.
యెష్షయి కుమారుడైన దావీదు ఇశ్రాయేలీయులందరి మీద రాజైయుండెను.
అతడు ఇశ్రాయేలీయులను ఏలిన కాలము నలువది సంవత్సరములు; హెబ్రోనులో ఏడు సంవత్సరములును, యెరూషలేములో ముప్పది మూడు సంవత్సరములును అతడు ఏలెను.
ఇది జరిగిన తరువాత యూదా పట్టణములలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను.
దావీదు హెబ్రోనులో యూదావారిమీద ఏలినకాలమంతయు ఏడు సంవత్సరములు ఆరు మాసములు.
హెబ్రోనులో అతడు యూదా వారందరిమీద ఏడు సంవత్సరములు ఆరు మాసములు, యెరూషలేములో ఇశ్రాయేలు యూదాల వారందరిమీద ముప్పదిమూడు సంవత్సరములు పరిపాలన చేసెను.
సొలొమోను యెరూషలేమునందు ఇశ్రాయేలీయులందరిని ఏలిన కాలము నలువది సంవత్సరములు.
ఈ ఆరుగురు హెబ్రోనులో అతనికి పుట్టిరి, అచ్చట అతడు ఏడు సంవత్సరముల ఆరునెలలు ఏలెను,
అప్పుడు ఇశ్రాయేలీయులందరును హెబ్రోనులోనుండు దావీదునొద్దకు కూడి వచ్చి చిత్తగించుము, మేము నీకు ఎముకనంటినవారము రక్తసంబంధులము.
హెబ్రోనీయులను గూర్చినది. హెబ్రోనీయుల పితరుల యింటిపెద్దలందరికి యెరీయా పెద్దయాయెను. దావీదు ఏలుబడిలో నలువదియవ సంవత్సరమున వారి సంగతి విచారింపగా వారిలో గిలాదు దేశములోని యాజేరునందున్న వారు పరాక్రమశాలులుగా కనబడిరి.