1రాజులు 2: 39
క్రాస్-రిఫరెన్స్‌లు
" అయితే మూడు సంవత్సరములైన తరువాత షిమీయొక్క పనివారిలో ఇద్దరు పారిపోయి మయకా కుమారుడైన ఆకీషు అను గాతు రాజునొద్దకు చేరిరి. అంతట నీవారు గాతులో ఉన్నారని షిమీకి వర్తమానము కాగా"
సంబంధిత రిఫరెన్స్‌లు
అంతట దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషునొద్దకు వచ్చెను.
లేచి తనయొద్దనున్న ఆరువందలమందితో కూడ ప్రయాణమై మాయోకు కుమారుడును గాతు రాజునైన ఆకీషునొద్దకు వచ్చెను.
దావీదు గాతులో ఆకీషునొద్ద చేరగా అతడును అతని వారందరును తమ తమ కుటుంబముల సమేతముగా కాపురముండిరి. యెజ్రెయేలీయురాలగు అహీనోయము, నాబాలు భార్యయైయుండిన కర్మెలీయురాలగు అబీగయీలు అను అతని యిద్దరు భార్యలు దావీదుతోకూడ ఉండిరి.
అంతట సిరియా రాజైన హజాయేలు గాతు పట్టణముమీదికి పోయి యుద్ధముచేసి దాని పట్టుకొనిన తరువాత అతడు యెరూషలేముమీదికి రాదలచియుండగా