1రాజులు 22: 30
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఇశ్రాయేలు రాజు నేను మారువేషము వేసికొని యుద్ధములో ప్రవేశించెదను, నీవైతే నీ వస్త్రములు ధరించుకొని ప్రవేశించుమని యెహోషాపాతుతో చెప్పి మారువేషము వేసికొని యుద్ధమందు ప్రవేశించెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఇశ్రాయేలు రాజును యూదారాజగు యెహోషాపాతును రాజవస్త్రములు ధరించుకొని, షోమ్రోను గవిని దగ్గరనున్న విశాలస్థలమందు గద్దెలమీద ఆసీనులైయుండి, ప్రవక్తలందరును వారి సమక్షమందు ప్రకటన చేయుచుండగా
అందరు ఒకరితో నొకరు అబద్ధములాడుదురు మోసకరమైన మనస్సుగలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు.
యరొబాము తన భార్యతో ఇట్లనెను నీవు లేచి యరొబాము భార్యవని తెలియబడకుండ మారువేషము వేసికొని షిలోహునకు పొమ్ము; ఈ జనుల మీద నేను రాజునగుదునని నాకు సమాచారము తెలియజెప్పిన ప్రవక్తయగు అహీయా అక్కడ ఉన్నాడు.
అప్పుడు ఆ ప్రవక్త పోయి, కండ్లమీద పాగా కట్టుకొని మారు వేషము వేసికొని, మార్గమందు రాజు యొక్క రాకకై కనిపెట్టుకొని యుండి
కాబట్టి సౌలు మారువేషము ధరించి వేరు బట్టలు తొడుగుకొని యిద్దరు మనుష్యులను వెంటబెట్టుకొని పోయి రాత్రివేళ ఆ స్త్రీయొద్దకు వచ్చి కర్ణపిశాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాటలాడుటకై నేను నీతో చెప్పువాని రప్పించుమని కోరగా
తెకోవనుండి యుక్తిగల యొక స్త్రీని పిలువనంపించి ఏడ్చుచున్న దానవైనట్టు నటించి దుఃఖవస్త్రములు ధరించుకొని తైలము పూసికొనక బహు కాలము దుఃఖపడిన దానివలెనుండి
ఇశ్రాయేలు రాజునేను మారువేషము వేసికొని యుద్ధమునకు పోవుదును, నీవు నీ వస్త్రములనే ధరించుకొనుమని యెహోషాపాతుతో చెప్పి తాను మారువేషము వేసికొనెను, తరువాత వారు యుద్ధమునకు పోయిరి.
అయినను యోషీయా అతనితో యుద్ధము చేయగోరి, అతనియొద్దనుండి తిరిగిపోక మారువేషము ధరించుకొని, యెహోవా నోటి మాటలుగా పలుకబడిన నెకో మాటలను వినక మెగిద్దో లోయయందు యుద్ధము చేయవచ్చెను.
యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు.
యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండ రహస్య స్థలములలో దాగగలవాడెవడైన కలడా? నేను భూమ్యాకాశముల యందంతట నున్నవాడను కానా? యిదే యెహోవా వాక్కు.