లేఖనాలను అన్వేషించండి

1రాజులు 22: 9

క్రాస్-రిఫరెన్స్‌లు

" అప్పుడు ఇశ్రాయేలు రాజు తన పరివారములో ఒకనిని పిలిచి ఇవ్లూ కుమారుడైన మీకాయాను శీఘ్రముగా ఇక్కడికి రప్పించుమని సెలవిచ్చెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

2రాజులు 9:32

అతడు తలయెత్తి కిటికీతట్టు చూచి నా పక్షమందున్నవారెవరని అడుగగా ఇద్దరు ముగ్గురు పరిచారకులు పైనుండి తొంగిచూచిరి.

2దినవృత్తాంతములు 18:8

అప్పుడు ఇశ్రాయేలు రాజు తన పరివారములోనున్న యొకని పిలిపించి ఇవ్లూ కుమారుడైన మీకాయాను శీఘ్రముగా రప్పించుమని ఆజ్ఞ ఇచ్చెను.

యెషయా 39:7

మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్రసంతును బబులోను రాజు నగరునందు నపుంసకులగా చేయుటకై వారు తీసికొనిపోవుదురు.

దానియేలు 1:18

నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవలెనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల యధిపతి రాజు సముఖమున వారిని నిలువబెట్టెను.

1రాజులు 22:26

అప్పుడు ఇశ్రాయేలు రాజు మీకాయాను పట్టుకొని తీసికొనిపోయి పట్టణపు అధికారియైన ఆమోనునకును రాజకుమారుడైన యోవాషునకును అప్పగించి

1రాజులు 22:27

బందీగృహములో ఉంచి, మేము క్షేమముగా తిరిగివచ్చువరకు అతనికి కష్టమైన అన్నము నీళ్లు ఈయుడని ఆజ్ఞ ఇచ్చెను.

1రాజులు 18:20

అహాబు ఇశ్రాయేలువారందరియొద్దకు దూతలను పంపి, ప్రవక్తలను కర్మెలు పర్వతమునకు సమకూర్చెను.