1రాజులు 22: 47
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఆ కాలమందు ఎదోము దేశమునకు రాజు లేకపోయెను; ప్రధానియైన యొకడు రాజ్యపాలనము చేయుచుండెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
రెండు జనములు నీ గర్భములో కలవు. రెండు జనపదములు నీ కడుపులోనుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటె ఒక జనపదము బలిష్టమై యుండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను.
నీవు నీ కత్తిచేత బ్రదుకుదువు నీ సహోదరునికి దాసుడవగుదువు నీవు తిరుగులాడుచుండగా నీ మెడమీదనుండి అతనికాడి విరిచివేయుదువు అని అతని కుత్తరమిచ్చెను.
మరియు ఏ రాజైనను ఇశ్రాయేలీయుల మీద రాజ్య పరిపాలన చేయకమునుపు, ఎదోము దేశములో రాజ్య పరిపాలన చేసిన రాజులెవరనగా
బెయారు కుమారుడైన బెల ఎదోములో రాజ్య పరిపాలన చేసెను. అతని ఊరి పేరు దిన్హాబా
బెల చనిపోయిన తరువాత బొస్రా వాడైన జెరహు కుమారుడగు యోబాబు అతనికి ప్రతిగా రాజాయెను.
యోబాబు చనిపోయిన తరువాత తేమనీయుల దేశస్థుడైన హుషాము అతనికి ప్రతిగా రాజాయెను.
హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశమందు మిద్యానును కొట్టివేసిన బదదు కుమారుడైన హదదు అతనికి ప్రతిగా రాజాయెను. అతని ఊరి పేరు అవీతు.
హదదు చనిపోయిన తరువాత మశ్రేకా వాడైన శవ్లూ అతనికి ప్రతిగా రాజాయెను.
శవ్లూ చనిపోయిన తరువాత నదీతీరమందలి రహెబోతు వాడైన షావూలు అతనికి ప్రతిగా రాజాయెను.
షావూలు చనిపోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్‌హానాను అతనికి ప్రతిగా రాజాయెను.
అక్బోరు కుమారుడైన బయల్‌హానాను చనిపోయిన తరువాత హదరు అతనికి ప్రతిగా రాజాయెను. అతని ఊరి పేరు పాయు. అతని భార్య పేరు మహేతబేలు. ఆమె మేజాహాబు కుమార్తెయైన మత్రేదు కుమార్తె
మరియు వారివారి వంశముల ప్రకారము వారివారి స్థలములలో వారివారి పేరుల చొప్పున ఏశావు సంతానపు నాయకుల పేరులేవనగా తిమ్నా నాయకుడు అల్వా నాయకుడు యతేతు నాయకుడు
అహొలీబామా నాయకుడు ఏలా నాయకుడు పీనోను నాయకుడు
కనజు నాయకుడు తేమాను నాయకుడు మిబ్సారు నాయకుడు
మగ్దీయేలు నాయకుడు ఈరాము నాయకుడు. వీరు తమతమ స్వాస్థ్యమైన దేశమందు తమతమ నివాసస్థలముల ప్రకారము ఎదోము నాయకులు. ఏశావు ఎదోమీయులకు మూలపురుషుడు.
మరియు ఎదోము దేశమందు అతడు దండునుంచెను. ఎదోమీయులు దావీదునకు దాసులు కాగా ఎదోము దేశమంతట అతడు కావలిదండుంచెను; దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను.
ఇశ్రాయేలు రాజును యూదా రాజును ఎదోము రాజును బయలుదేరి యేడు దినములు చుట్టు తిరిగిన తరువాత, వారితో కూడనున్న దండువారికిని పశువులకును నీళ్లు లేకపోయెను.
ఇతని దినములలో ఎదోమీయులు యూదా రాజునకు ఇక లోబడుట మాని అతనిమీద తిరుగుబాటు చేసి, తమమీద నొకని రాజుగా నియమించుకొనినందున
మోయాబు నేను కాళ్లు కడగుకొను పళ్లెము ఎదోముమీదికి నా చెప్పు విసరివేయుదును ఫిలిష్తియనుబట్టి జయోత్సవము చేసియున్నాను.
కోటగల పట్టణములోనికి నన్ను ఎవడు తోడుకొనిపోవును? ఎదోములోనికి నన్నెవడు నడిపించును?
జనములు నీకు దాసులగుదురు జనములు నీకు సాగిలపడుదురు నీ బంధుజనులకు నీవు ఏలికవై యుండుము నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు నిన్ను శపించువారు శపింపబడుదురు నిన్ను దీవించువారు దీవింపబడుదురు గాక
అతని దినములలో ఎదోమీయులు తిరుగబడి యూదావారి అధికారము త్రోసివేసి తమకు ఒక రాజును చేసికొనగా
పిల్లలింక పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను.