లేఖనాలను అన్వేషించండి

1రాజులు 5: 11

క్రాస్-రిఫరెన్స్‌లు

" సొలొమోను హీరామునకును అతని యింటివారి సంరక్షణకును ఆహారముగా రెండులక్షల తూముల గోధుమలను మూడువేల ఎనిమిదివందల పళ్ల స్వచ్ఛమైన నూనెను పంపించెను. ఈ ప్రకారము సొలొమోను ప్రతి సంవత్సరము హీరామునకు ఇచ్చుచువచ్చెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

1రాజులు 4:22

ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామగ్రి యెంతయనగా, ఆరువందల తూముల సన్నపు గోధుమపిండియు, వేయిన్ని రెండువందల తూముల ముతకపిండియు,

2దినవృత్తాంతములు 2:10

మ్రానులు కొట్టు మీ పనివారికి నాలుగువందల గరిసెల దంచిన గోధుమలను ఎనిమిదివందల పుట్ల యవలను నూట నలువదిపుట్ల ద్రాక్షారసమును నూట నలువదిపుట్ల నూనెను ఇచ్చెదను.

ఆదికాండము 27:28

ఆకాశపుమంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీ కనుగ్రహించు గాక

ద్వితియోపదేశాకాండము 8:8

అది గోధుమలు యవలు ద్రాక్షచెట్లు అంజూరపుచెట్లు దానిమ్మపండ్లును గల దేశము, ఒలీవ నూనెయు తేనెయు గల దేశము.

2దినవృత్తాంతములు 2:15

ఇప్పుడు నా యేలినవాడు చెప్పియున్న గోధుమలను యవలను నూనెను ద్రాక్షారసమును నీ సేవకుల చేతికిచ్చి వారిని సాగనంపినయెడల