లేఖనాలను అన్వేషించండి

1రాజులు 5: 8

క్రాస్-రిఫరెన్స్‌లు

" సొలొమోనునకు ఈ వర్తమానము పంపెను నీవు నాయొద్దకు పంపిన వర్తమానమును నేను అంగీకరించితిని; దేవదారు మ్రానులను గూర్చియు సరళపు మ్రానులను గూర్చియు నీ కోరిక యంతటి ప్రకారము నేను చేయించెదను."

సంబంధిత రిఫరెన్స్‌లు

1రాజులు 6:15

అతడు మందిరపు లోపలి గోడలను అడుగునుండి పైకప్పు వరకు దేవదారు పలకలచేత కట్టించెను; లోపల వాటిని సరళపుమ్రాను పలకలతో కప్పి మందిరపు నట్టిల్లు దేవదారు పలకలతో కప్పివేసెను.

1రాజులు 6:34

రెండు తలుపులు దేవదారు కఱ్ఱతో చేయబడియుండెను; ఒక్కొక్క తలుపునకు రెండేసి మడత రెక్కలు ఉండెను.

2సమూయేలు 6:5

దావీదును ఇశ్రాయేలీయులందరును సరళవృక్షపు కఱ్ఱతో చేయబడిన నానావిధములైన సితారాలను స్వర మండలములను తంబురలను మృదంగములను పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి.

2దినవృత్తాంతములు 3:5

మందిరపు పెద్ద గదిని దేవదారు పలకలతో కప్పి వాటిపైన మేలిమి బంగారమును పొదిగించి పైభాగమున ఖర్జూరపుచెట్లవంటి పనియు గొలుసులవంటి పనియు చెక్కించి

2సమూయేలు 5:11

తూరు రాజగు హీరాము, దూతలను దేవదారు మ్రానులను వడ్రంగులను కాసెపనివారిని పంపగా వారు దావీదు కొరకు ఒక నగరిని కట్టిరి.

1దినవృత్తాంతములు 14:1

తూరు రాజైన హీరాము దావీదునొద్దకు దూతలను, అతనికి ఒక యిల్లు కట్టుటకై దేవదారు మ్రానులను, కాసె పనివారిని వడ్లవారిని పంపెను.

2దినవృత్తాంతములు 2:16

మేము నీకు కావలసిన మ్రానులన్నియు లెబానోనునందు కొట్టించి వాటిని నీకొరకు సముద్రముమీద తెప్పలుగా యొప్పేకు కొనివచ్చెదము, తరువాత నీవు వాటిని యెరూషలేమునకు తెప్పించుకొనవచ్చును అని వ్రాసెను.