లేఖనాలను అన్వేషించండి

1సమూయేలు 23: 11

క్రాస్-రిఫరెన్స్‌లు

" కెయీలా జనులు నన్ను అతని చేతికి అప్పగించుదురా? నీ దాసుడనైన నాకు వినబడినట్లు సౌలు దిగివచ్చునా? ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, దయచేసి నీ దాసుడనైన నాకు దానిని తెలియజేయుమని ప్రార్థింపగా అతడు దిగివచ్చునని యెహోవా సెలవిచ్చెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

కీర్తనలు 50:15

ఆపత్కాలమున నీవు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టుము నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమ పరచెదవు.

యిర్మియా 33:3

నాకు మొఱ్ఱపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును.

మత్తయి 7:7

అడుగుడి మీకియ్యబడును. వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును.

మత్తయి 7:8

అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడును.

1సమూయేలు 10:22

కావున వారు ఇక్కడికి ఇంకొక మనుష్యుడు రావలసియున్నదా అని యెహోవా యొద్ద విచారణచేయగా యెహోవా ఇదిగో అతడు సామానులో దాగియున్నాడని సెలవిచ్చెను.

2సమూయేలు 21:1

దావీదు కాలమున మూడు సంవత్సరములు విడువకుండ కరవు కలుగగా దావీదు యెహోవాతో మనవిచేసెను. అందుకు యెహోవా ఈలాగున సెలవిచ్చెను సౌలు గిబియోనీయులను హతముచేసెను గనుక అతనినిబట్టియు, నరహంతకులగు అతని యింటివారినిబట్టియు శిక్షగా ఈ కరవు కలిగెను.

కీర్తనలు 142:4

నా కుడిప్రక్కను నిదానించి చూడుము నన్నెరిగినవాడు ఒకడును నాకు లేకపోయెను ఆశ్రయమేదియు నాకు దొరకలేదు నాయెడల జాలిపడువాడు ఒకడును లేడు.

యిర్మియా 11:18

దానిని యెహోవా నాకు తెలియజేయగా నేను గ్రహించితిని; ఆయన3 వారి క్రియలను నాకు కనుపరచెను.