1సమూయేలు 23: 12
క్రాస్-రిఫరెన్స్‌లు
" కెయీలా జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరల మనవి చేయగా యెహోవా వారు నిన్ను అప్పగించుదురని సెలవిచ్చెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
నీవు శత్రువులచేత నన్ను చెరపెట్టలేదు విశాలస్థలమున నా పాదములు నిలువబెట్టితివి.
దావీదు కెయీలాకు వచ్చిన సంగతి సౌలు విని దావీదు ద్వారములును అడ్డుగడలునుగల పట్టణములో ప్రవేశించి అందులో మూయబడియున్నాడు, దేవుడతనిని నాచేతికి అప్పగించెననుకొనెను.
నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయనవలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము ఆయనే నా రక్షణకర్త
మనుష్యులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు.
ఏమనగా ఒక చిన్న పట్టణముండెను, దానియందు కొద్దిమంది కాపురముండిరి; దానిమీదికి గొప్ప రాజు వచ్చి దాని ముట్టడివేసి దానియెదుట గొప్ప బురుజులు కట్టించెను;
అయితే అందులో జ్ఞానముగల యొక బీదవాడుండి తన జ్ఞానముచేత ఆ పట్టణమును రక్షించెను, అయినను ఎవరును ఆ బీదవానిని జ్ఞాపకముంచుకొనలేదు.
తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండ లోలోపల వాటిని మరుగుచేయ జూచువారికి శ్రమ. మమ్మునెవరు చూచెదరు? మా పని యెవరికి తెలియును? అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించువారికి శ్రమ.
మరియు ఆయన దృష్టికి కనబడని సృష్ఠము ఏదియు లేదు. మనమెవనికి లెక్క యొప్పచెప్పవలసి యున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది.
కావున వారు ఇక్కడికి ఇంకొక మనుష్యుడు రావలసియున్నదా అని యెహోవా యొద్ద విచారణచేయగా యెహోవా ఇదిగో అతడు సామానులో దాగియున్నాడని సెలవిచ్చెను.
అహీమెలెకు అతని పక్షముగా యెహోవా యొద్ద విచారణ చేసి, ఆహారమును ఫిలిష్తీయుడైన గొల్యాతు ఖడ్గమును అతనికిచ్చెనని చెప్పగా
ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసినవాడవై, నాయెడల నీకున్న ఉపకారబుద్ధిని వెల్లడిచేసితివి గనుక నీవు నాకంటె నీతిపరుడవు.
మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు నేను ఉత్తమమైనదాని ననుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి
అల్పులైనవారు వట్టి ఊపిరియై యున్నారు. ఘనులైనవారు మాయస్వరూపులు త్రాసులో వారందరు తేలిపోవుదురు వట్టి ఊపిరికన్న అలకనగా ఉన్నారు
దానిని యెహోవా నాకు తెలియజేయగా నేను గ్రహించితిని; ఆయన3 వారి క్రియలను నాకు కనుపరచెను.