లేఖనాలను అన్వేషించండి

1సమూయేలు 8: 22

క్రాస్-రిఫరెన్స్‌లు

" గనుక యెహోవా నీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించుమని సమూయేలునకు సెలవియ్యగా సమూయేలు మీరందరు మీ మీ గ్రామములకు పొండని ఇశ్రాయేలీయులకు సెలవిచ్చెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

1సమూయేలు 8:7

అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము; వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండ నన్నే విసర్జించియున్నారు.

హోషేయ 13:11

కాగా కోపము తెచ్చుకొని నీకు రాజును నియమించితిని; క్రోధము కలిగి అతని కొట్టివేయుచున్నాను.

నిర్గమకాండము 18:23

దేవుడు ఈలాగు చేయుటకు నీకు సెలవిచ్చినయెడల నీవు ఈ పని చేయుచు దాని భారమును సహింపగలవు. మరియు ఈ ప్రజలందరు తమ తమ చోట్లకు సమాధానముగా వెళ్లుదురని చెప్పెను.