2రాజులు 23: 16
క్రాస్-రిఫరెన్స్‌లు
" యోషీయా అటు తిరిగి అచ్చట పర్వతమందున్న సమాధులను చూచి కొందరిని పంపి సమాధులలోనున్న శల్యములను తెప్పించి, దైవజనుడు యెహోవా మాట చాటించి చెప్పిన ప్రకారము వాటిని బలిపీఠముమీద కాల్చి దాని అపవిత్రపరచెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
అంతట దైవజనుడైన యొకడు యెహోవాచేత సెలవునొంది యూదాదేశమునుండి బేతేలునకు వచ్చెను. ధూపము వేయుటకై యరొబాము ఆ బలిపీఠమునొద్ద నిలిచియుండగా
ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞచేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను బలిపీఠమా బలిపీఠమా, యెహోవా సెలవిచ్చునదేమనగా దావీదు సంతతిలో యోషీయా అను నొక శిశువు పుట్టును; నీమీద ధూపము వేసిన ఉన్నత స్థలముయొక్క యాజకులను అతడు నీమీద అర్పించును; అతడు మనుష్య శల్యములను నీమీద దహనము చేయును.
యెహోవా మాటనుబట్టి బేతేలులోనున్న బలిపీఠమునకు విరోధముగాను, షోమ్రోను పట్టణములోనున్న ఉన్నత స్థలములలోని మందిరములన్నిటికి విరోధము గాను, అతడు ప్రకటించినది అవశ్యముగా సంభవించునని తన కుమారులతో చెప్పెను.
ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు.
లేఖనము నిరర్థకము కానేరదు గదా, దేవుని వాక్యమెవరికి వచ్చెనో వారే దైవములని చెప్పినయెడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు,
నేను మీ యున్నతస్థలములను పాడుచేసెదను; మీ విగ్రహములను పడగొట్టెదను; మీ బొమ్మల పీనుగులమీద మీ పీనుగులను పడవేయించెదను.
ఆ ప్రతిమలను తునకలుగా కొట్టించి, అషేరాదేవి ప్రతిమను పడగొట్టించి వాటి స్థానములను నర శల్యములతో నింపెను.
బయలుదేవత యాజకుల శల్యములను బలిపీఠములమీద అతడు కాల్పించి, యూదాదేశమును యెరూషలేమును పవిత్రపరచెను.
యెహోవా వాక్కు ఆ కాలమున శత్రువులు యూదారాజుల యెముకలను అధిపతుల యెముకలను యాజకుల యెముకలను ప్రవక్తల యెముకలను యెరూషలేము నివాసుల యెముకలను సమాధులలోనుండి వెలుపలికి తీసి
యెహోవా మందిరములో దైవ జనుడగు యిగ్దల్యా కుమారుడైన హానాను కుమారుల గదిలోనికి వారిని తీసికొని వచ్చితిని. అది రాజులగదికి సమీపమున ద్వారపాలకుడును షల్లూము కుమారుడునైన మయశేయా గదికి పైగా ఉండెను.
మీ బలిపీఠములు పాడైపోవును, సూర్యదేవతకు నిలిపిన స్తంభములు ఛిన్నా భిన్నములవును, మీ బొమ్మల యెదుట మీ జనులను నేను హతము చేసెదను.
ఒకని దాయాది కాల్చబోవు వానితోకూడ ఎముకలను ఇంటిలోనుండి బయటికి కొనిపోవుటకై శవమును ఎత్తినప్పుడు ఇంటి వెనుకటి భాగమున ఒకనిచూచి యింటిలో మరి ఎవరైన మిగిలియున్నారా? యని అడుగగా అతడు ఇంకెవరును లేరనును; అంతట దాయా దిట్లనును నీవిక నేమియు పలుకక ఊరకుండుము, యెహోవా నామము స్మరించకూడదు;