లేఖనాలను అన్వేషించండి

2రాజులు 23: 17

క్రాస్-రిఫరెన్స్‌లు

" అంతట అతడు నాకు కనబడుచున్న ఆ సమాధి యెవరిదని అడిగినప్పుడు పట్టణపువారు అది యూదాదేశమునుండి వచ్చి నీవు, బేతేలులోని బలిపీఠమునకు చేసిన క్రియలను ముందుగా తెలిపిన దైవజనుని సమాధియని చెప్పిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

1రాజులు 13:1

అంతట దైవజనుడైన యొకడు యెహోవాచేత సెలవునొంది యూదాదేశమునుండి బేతేలునకు వచ్చెను. ధూపము వేయుటకై యరొబాము ఆ బలిపీఠమునొద్ద నిలిచియుండగా

1రాజులు 13:30

అతడు తన సమాధిలో ఆ శవమును పెట్టగా జనులు కటకటా నా సహోదరుడా అని యేడ్చిరి.

1రాజులు 13:31

మరియు ఇతడు సమాధిలో శవమును పెట్టి నేను మరణమైనప్పుడు దైవజనుడైన యితడు పెట్టబడిన సమాధిలో నన్ను పాతిపెట్టుడి; నా శల్యములను అతని శల్యముదగ్గర ఉంచుడి,

యిర్మియా 35:4

యెహోవా మందిరములో దైవ జనుడగు యిగ్దల్యా కుమారుడైన హానాను కుమారుల గదిలోనికి వారిని తీసికొని వచ్చితిని. అది రాజులగదికి సమీపమున ద్వారపాలకుడును షల్లూము కుమారుడునైన మయశేయా గదికి పైగా ఉండెను.

1తిమోతి 6:11

దైవజనుడా, నీవైతే వీటివి విసర్జించి, నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము.