లేఖనాలను అన్వేషించండి

2రాజులు 23: 8

క్రాస్-రిఫరెన్స్‌లు

" యూదా పట్టణములోనున్న యాజకులనందరిని అతడు అవతలికి వెళ్లగొట్టెను, గెబా మొదలుకొని బెయేర్షెబా వరకును యాజకులు ధూపమువేసిన ఉన్నత స్థలములను అతడు అపవిత్ర పరచి, పట్టణములో ప్రవేశించువాని యెడమ పార్శ్వమున పట్టణపు అధికారియైన యెహోషువ గుమ్మముదగ్గరనుండు ఉన్నత స్థలములను పడగొట్టించెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

యెహోషువ 21:17

బెన్యామీను గోత్రము నుండి నాలుగు పట్టణములను అనగా గిబియోనును దాని పొలమును గెబను దాని పొలమును

1రాజులు 15:22

అప్పుడు రాజైన ఆసా యెవరును నిలిచిపోకుండ యూదాదేశపు వారందరు రావలెనని ప్రకటన చేయగా జనులు సమకూడి బయెషా కట్టించుచుండిన రామా పట్టణపు రాళ్లను కఱ్ఱలను ఎత్తికొని వచ్చిరి. రాజైన ఆసా వాటిచేత బెన్యామీను సంబంధమైన గెబను మిస్పాను కట్టించెను.

1దినవృత్తాంతములు 6:60

మరియు బెన్యామీను గోత్రస్థానములోని గెబ దాని గ్రామములు, అల్లెమెతు దాని గ్రామములు, అనాతోతు దాని గ్రామములు, వీరి వంశములకు కలిగిన పట్టణములన్నియు పదుమూడు.

యెషయా 10:29

వారు కొండసందు దాటి వచ్చుచున్నారు రామా వణకుచున్నది గెబలో బసచేతము రండని అనుచున్నారు సౌలు గిబ్యా నివాసులు పారిపోవుదురు.

జెకర్యా 14:10

యెరూషలేము బెన్యామీను గుమ్మమునుండి మూలగుమ్మము వరకును, అనగా మొదటి గుమ్మపు కొనవరకును, హనన్యేలు గుమ్మమునుండి రాజు గానుగుల వరకును వ్యాపించును, మరియు గెబనుండి యెరూషలేము దక్షిణపుతట్టున నున్న రిమ్మోను వరకు దేశమంతయు మైదానముగా ఉండును,

ఆదికాండము 21:31

అక్కడ వారిద్దరు అట్లు ప్రమాణము చేసికొనినందున ఆ చోటు బెయేర్షెబా అనబడెను.

ఆదికాండము 26:23

అక్కడనుండి అతడు బెయేర్షెబాకు వెళ్లెను.

న్యాయాధిపతులు 20:1

అంతట ఇశ్రాయేలీయులందరు బయలుదేరి దాను మొదలుకొని బెయేర్షెబావరకును గిలాదుదేశమువరకును వారి సమాజము ఏకమనస్సు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను.

1రాజులు 19:3

కాబట్టి అతడు ఈ సమాచారము తెలిసికొని, లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి, యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి, అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి

లేవీయకాండము 26:30

నేను మీ యున్నతస్థలములను పాడుచేసెదను; మీ విగ్రహములను పడగొట్టెదను; మీ బొమ్మల పీనుగులమీద మీ పీనుగులను పడవేయించెదను.

యెహెజ్కేలు 44:10

మరియు ఇశ్రాయేలీయులు నన్ను విసర్జించి తమ విగ్రహములను అనుసరింపగా, వారితోకూడ నన్ను విసర్జించిన లేవీయులు తమ దోషమును భరించుదురు.