ద్వితియోపదేశాకాండము 12: 15
క్రాస్-రిఫరెన్స్‌లు
" అయితే నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించినకొలది యిండ్లన్నిటిలో నీ మనస్సు కోరుదానిని చంపి తినవచ్చును. పవిత్రులేమి అపవిత్రులేమి యెఱ్ఱజింకను చిన్న దుప్పిని తినినట్లు తినవచ్చును."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఎద్దులకేమి గొఱ్ఱలకేమి ద్రాక్షారసమునకేమి మద్యమునకేమి నీవు కోరు దానికి ఆ వెండినిచ్చి, అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనముచేసి, నీవును నీ యింటివారును నీ యింటనుండు లేవీయులును సంతోషింపవలెను.
నీ దేవుడైన యెహోవా తన నామమును ప్రకటించుటకు ఏర్పరచుకొను స్థలము మీకు దూరముగా ఉండినయెడల
యెహోవా నీకిచ్చిన గోవులలోనిదేగాని మీ గొఱ్ఱమేకలలోనిదేగాని నేను నీకాజ్ఞాపించినట్లు చంపి నీవు ఆశించినదాని నీ యింట తినవచ్చును. జింకను దుప్పిని తినునట్లు దాని తినవచ్చును. పవిత్రాపవిత్రులు భేదము లేకుండ తినవచ్చును.
దుప్పి, ఎఱ్ఱ చిన్నజింక, దుప్పి, కారుమేక, కారుజింక, లేడి, కొండగొఱ్ఱ అనునవే.
జింకను దుప్పిని తినునట్లు నీ పురములలో పవిత్రాపవిత్రులు దాని తినవచ్చును. వాటి రక్తమును మాత్రము నీవు తినకూడదు. నీళ్లవలె భూమిమీద దాని పారబోయవలెను.
వాటి రక్తమును మాత్రము నీవు తినకూడదు. నీళ్లవలె భూమిమీద దాని పార బోయవలెను
ఇశ్రాయేలీయుల కుటుంబములలో యెహోవా మందిరము ఎదుట యెహోవాకు అర్పణము అర్పించుటకు పూనుకొనువాడు అది ఎద్దేగాని గొఱ్ఱయేగాని మేకయేగాని
ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దకు దానిని ముందు తేక పాళెములో వధించినను పాళెమునకు వెలుపల వధించినను ఆ మనుష్యుడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును;
వాడు రక్తమును ఒలికించినవాడు; ఇశ్రాయేలీయులు బయట వధించుచున్న బలి పశువులను ఇక బయట వధింపక యెహోవా పేరట యాజకునియొద్దకు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకే తీసికొని వచ్చి సమాధానబలిగా అర్పించునట్లు ఆ మనుష్యుడు జనులలోనుండి కొట్టివేయబడవలెను.
ప్రాణముగల సమస్త చరములు మీకు ఆహారమగును; పచ్చని కూరమొక్కల నిచ్చినట్లు వాటిని మీకిచ్చియున్నాను.
నీ దేవుడైన యెహోవా తాను నీకిచ్చిన మాటచొప్పున నీ సరిహద్దులను విశాలపరచిన తరువాత నిశ్చయముగా మాంసము తినగోరి మాంసము తినెదననుకొందువు. అప్పుడు నీకిష్టమైన మాంసము తినవచ్చును.