లేఖనాలను అన్వేషించండి

ద్వితియోపదేశాకాండము 15: 14

క్రాస్-రిఫరెన్స్‌లు

" నీవు ఐగుప్తు దేశములో దాసుడవైయున్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించెనని జ్ఞాపకము చేసికొని, నీ మందలోను నీ కళ్లములోను నీ ద్రాక్షగానుగలోను కొంత అవశ్యముగా వానికియ్యవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించి నీకనుగ్రహించిన దానిలో కొంత వానికియ్యవలెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

నెహెమ్యా 8:10

మరియు అతడు వారితో నిట్లనెను పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైనదాని పానము చేయుడి, ఇదివరకు తమకొరకు ఏమియు సిద్ధము చేసికొననివారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుటవలన మీరు బలమొందుదురు.

కీర్తనలు 68:10

నీ సమూహము దానిలో నివసించును దేవా, నీ అనుగ్రహముచేత దీనులకు సదుపాయము కలుగజేసితివి.

సామెతలు 10:22

యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టముచేత ఆ యాశీర్వాదము ఎక్కువ కాదు.

అపోస్తలులకార్యములు 20:35

మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసికొనవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పెను.

1కొరిందీయులకు 16:2

నేను వచ్చినప్పుడు చందా పోగుచేయకుండ ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తనయొద్ద కొంత సొమ్ము నిలువచేయవలెను.

సంఖ్యాకాండము 18:27

మీకు వచ్చు ప్రతిష్ఠార్పణము కళ్లపు పంటవలెను ద్రాక్షలతొట్టి ఫలమువలెను ఎంచవలెను.

ద్వితియోపదేశాకాండము 15:13

అయితే వాని విడిపించి నీయొద్దనుండి పంపివేయునప్పుడు నీవు వట్టిచేతులతో వాని పంపివేయకూడదు.

యోబు 31:17

తలిదండ్రులు లేనివారిని నా అన్నములో కొంచెమైనను తిననియ్యక నేను ఒంటరిగా భోజనము చేసినయెడలను

రోమీయులకు 12:8

బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పనికలిగి యుందము. పంచిపెట్టువాడు శుద్ధమనస్సుతోను, పైవిచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను.

2కొరిందీయులకు 9:7

సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును.