లేఖనాలను అన్వేషించండి

ద్వితియోపదేశాకాండము 19: 1

క్రాస్-రిఫరెన్స్‌లు

" నీ దేవుడైన యెహోవా యెవరి దేశమును నీకిచ్చుచున్నాడో ఆ జనములను నీ దేవుడైన యెహోవా నాశనము చేసిన తరువాత నీవు వారి దేశమును స్వాధీనపరచుకొని, వారి పట్టణములలోను వారి యిండ్లలోను నివసించునప్పుడు"

సంబంధిత రిఫరెన్స్‌లు

ద్వితియోపదేశాకాండము 6:10

నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో చేసిన ప్రమాణమునుబట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి, నీవు కట్టని గొప్పవగు మంచి పురములను

ద్వితియోపదేశాకాండము 7:1

నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్నుచేర్చి బహు జనములను, అనగా సంఖ్యకును బలమునకును నిన్నుమించిన హిత్తీయులు గిర్గాషీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులను ఏడు జనములను నీ యెదుటనుండి వెళ్లగొట్టిన తరువాత

ద్వితియోపదేశాకాండము 7:2

నీ దేవుడైన యెహోవా వారిని నీకప్పగించునప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను. వారితో నిబంధన చేసికొనకూడదు, వారిని కరుణింపకూడదు,

ద్వితియోపదేశాకాండము 12:1

మీరు స్వాధీనపరచుకొనుటకు నీ పితరుల దేవుడైన యెహోవా నీకిచ్చిన దేశమున మీరు భూమిమీద బ్రదుకు దినములన్నిటను మీరు అనుసరించి గైకొనవలసిన కట్టడలును విధులును ఇవి.

ద్వితియోపదేశాకాండము 12:29

నీవు వారి దేశమును స్వాధీనపరచుకొనుటకు వెళ్లుచున్న జనములను నీ దేవుడైన యెహోవా నీ యెదుటనుండి నాశము చేసిన తరువాత, నీవు వారి స్వాస్థ్యమును స్వాధీనపరచుకొని, వారి దేశములో నివసించునప్పుడు, వారు నీ యెదుటనుండి నశింపజేయబడిన తరువాత నీవు వారివెంట వెళ్లి చిక్కుబడి,

ద్వితియోపదేశాకాండము 17:14

నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాని స్వాధీనపరచుకొని అందులో నివసించి నా చుట్టునున్న సమస్త జనమువలె నామీద రాజును నియమించుకొందుననుకొనినయెడల. నీ దేవుడైన యెహోవా ఏర్పరచువానిని అవశ్యముగా నీమీద రాజుగా నియమించుకొనవలెను.

ద్వితియోపదేశాకాండము 12:29

నీవు వారి దేశమును స్వాధీనపరచుకొనుటకు వెళ్లుచున్న జనములను నీ దేవుడైన యెహోవా నీ యెదుటనుండి నాశము చేసిన తరువాత, నీవు వారి స్వాస్థ్యమును స్వాధీనపరచుకొని, వారి దేశములో నివసించునప్పుడు, వారు నీ యెదుటనుండి నశింపజేయబడిన తరువాత నీవు వారివెంట వెళ్లి చిక్కుబడి,

నిర్గమకాండము 13:5

యెహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణము చేసినట్లు, కనానీయులకు హిత్తీయులకు అమోరీయులకు హివ్వీయులకు యెబూసీయులకు నివాస స్థానమై యుండు, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించిన తరువాత నీవు ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకొనవలెను.

నిర్గమకాండము 21:13

అయితే వాడు చంపవలెనని పొంచియుండకయే దైవికముగా వానిచేత ఆ హత్య జరిగినయెడల వాడు పారిపోగల యొక స్థలమును నీకు నిర్ణయించెదను.

లేవీయకాండము 14:34

నేను స్వాస్థ్యముగా మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చిన తరువాత, మీ స్వాస్థ్యమైన దేశములోని యే యింటనైనను నేను కుష్ఠుపొడ కలుగజేసినయెడల

సంఖ్యాకాండము 35:10

మీరు యొర్దాను దాటి కనాను దేశములోనికి వెళ్లిన తరువాత

ద్వితియోపదేశాకాండము 4:42

చంపినవాడు పారిపోవుటకు మోషే తూర్పుదిక్కున, యొర్దాను ఇవతల మూడు పురములను వేరుపరచెను. అట్టివాడెవడైనను ఆ పురములలో దేనిలోనికినైనను పారిపోయి బ్రదుకును.