లేఖనాలను అన్వేషించండి

ద్వితియోపదేశాకాండము 21: 10

క్రాస్-రిఫరెన్స్‌లు

" నీవు నీ శత్రువులతో యుద్ధము చేయబోవునప్పుడు నీ దేవుడైన యెహోవా నీచేతికి వారిని అప్పగించిన తరువాత"

సంబంధిత రిఫరెన్స్‌లు

ద్వితియోపదేశాకాండము 20:10

యుధ్దము చేయుటకు మీరొక పురముమీదికి సమీపించునప్పుడు సమాధానము నిమిత్తము రాయబారమును పంపవలెను. సమాధానమని అది నీకు ఉత్తరమిచ్చి

ద్వితియోపదేశాకాండము 20:11

గుమ్మములను తెరచినయెడల దానిలోనున్న జనులందరు నీకు పన్ను చెల్లించి నీ దాసులగుదురు.

ద్వితియోపదేశాకాండము 20:12

అది మీతో సమాధానపడక యుద్ధమే మంచిదని యెంచినయెడల దాని ముట్టడివేయుడి.

ద్వితియోపదేశాకాండము 20:13

నీ దేవుడైన యెహోవా దాని నీచేతి కప్పగించునప్పుడు దానిలోని మగవారినందరిని కత్తివాత హతము చేయవలెను.

ద్వితియోపదేశాకాండము 20:14

అయితే స్త్రీలను చిన్నవారిని పశువులను ఆ పురములోనున్నది యావత్తును దాని కొల్లసొమ్మంతటిని నీవు తీసికొనవచ్చును; నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ శత్రువుల కొల్లసొమ్మును నీవు అనుభవించుదువు.

ద్వితియోపదేశాకాండము 20:15

ఈ జనముల పురములు గాక నీకు బహు దూరముగా ఉండిన సమస్త పురములకు మాత్రమే యీలాగున చేయవలెను.

ద్వితియోపదేశాకాండము 20:16

అయితే నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న యీ జనముల పురములలో ఊపిరిగల దేనిని బ్రదుకనియ్యకూడదు.

సంఖ్యాకాండము 31:18

పురుషసంయోగము ఎరుగని ప్రతి ఆడుపిల్లను మీ నిమిత్తము బ్రతుకనీయుడి.