లేఖనాలను అన్వేషించండి

ద్వితియోపదేశాకాండము 30: 12

క్రాస్-రిఫరెన్స్‌లు

" మనము దానిని విని గైకొనునట్లు, ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మనయొద్దకు దాని తెచ్చును? అని నీ వనుకొనుటకు అది ఆకాశమందు ఉండునది కాదు;"

సంబంధిత రిఫరెన్స్‌లు

సామెతలు 30:4

ఆకాశమునకెక్కి మరల దిగినవాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకొన్నవాడెవడు? బట్టలో నీళ్లు మూటకట్టినవాడెవడు? భూమియొక్క దిక్కులన్నిటిని స్థాపించినవాడెవడు? ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసియున్నదా?

యోహాను 3:13

మరియు పరలోకమునుండి దిగి వచ్చినవాడే, అనగా పరలోకములో ఉండు మనుష్యకుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు.

రోమీయులకు 10:6

అయితే విశ్వాసమూలమగు నీతి యీలాగు చెప్పుచున్నది ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును? అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు;

రోమీయులకు 10:7

లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును? అనగా క్రీస్తును మృతులలోనుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములో అనుకొనవద్దు.

రోమీయులకు 2:13

ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారుగాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు.