లేఖనాలను అన్వేషించండి

ద్వితియోపదేశాకాండము 6: 9

క్రాస్-రిఫరెన్స్‌లు

" నీ యింటి ద్వారబంధములమీదను నీ గవునులమీదను వాటిని వ్రాయవలెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

ద్వితియోపదేశాకాండము 11:20

నీ యింటి ద్వారబంధములమీదను నీ గవునులమీదను వాటిని వ్రాయవలెను.

నిర్గమకాండము 12:7

ఈ నెల పదునాలుగవ దినమువరకు మీరు దాని నుంచుకొనవలెను; తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరు తమ తమ కూటములలో సాయంకాలమందు దాని చంపి దాని రక్తము కొంచెము తీసి, తాము దాని తిని యిండ్ల ద్వారబంధపు రెండు నిలువుకమ్ములమీదను పై కమ్మిమీదను చల్లి

యోబు 19:23

నా మాటలు వ్రాయబడవలెనని నేనెంతో కోరుచున్నాను. అవి గ్రంథములో వ్రాయబడవలెనని నేనెంతో కోరుచున్నాను.

యోబు 19:24

అవి యినుప పోగరతో బండమీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలువవలెనని నేనెంతో కోరుచున్నాను.

యోబు 19:25

అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమిమీద నిలుచుననియు నేనెరుగుదును.

యెషయా 30:8

రాబోవు దినములలో చిరకాలమువరకు నిత్యము సాక్ష్యార్థముగా నుండునట్లు నీవు వెళ్లి వారియెదుట పలకమీద దీని వ్రాసి గ్రంథములో లిఖింపుము

యెషయా 57:8

నాకు మరుగై బట్టలుతీసి మంచమెక్కితివి నీ పరుపు వెడల్పుచేసికొని నీ పక్షముగా వారితో నిబంధన చేసితివి నీవు వారి మంచము కనబడిన చోట దాని ప్రేమించితివి.

హబక్కూకు 2:2

యెహోవా నాకీలాగు సెలవిచ్చెను చదువువాడు పరుగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలకమీద స్పష్టముగా వ్రాయుము.

సామెతలు 7:3

నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము నీ హృదయమను పలకమీద వాటిని వ్రాసికొనుము