లేఖనాలను అన్వేషించండి

ఎస్తేరు 9: 16

క్రాస్-రిఫరెన్స్‌లు

" రాజు సంస్థానములయందుండు తక్కిన యూదులు కూడుకొని, తమ ప్రాణములను రక్షించుకొనుటకై పూనుకొని అదారు మాసము పదమూడవ దినమందు తమ విరోధులలో డెబ్బది యయిదువేల మందిని చంపివేసి, తమ పగవారివలన బాధలేకుండ నెమ్మదిపొందిరి; అయితే వారును కొల్లసొమ్ము పట్టుకొనలేదు."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఎస్తేరు 9:2

యూదులు రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటిలో నుండు పట్టణములయందు తమకు కీడు చేయవలెనని చూచినవారిని హతము చేయుటకు కూడుకొనిరి. వారినిగూర్చి సకలజనులకు భయము కలిగినందున ఎవరును వారి ముందర నిలువలేకపోయిరి.

ఎస్తేరు 8:11

రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటిలో ఒక్క దినమందే, అనగా అదారు అను పండ్రెండవ నెల పదమూడవ దినమందే ప్రతి పట్టణమునందుండు యూదులు కూడుకొని, తమ ప్రాణములు కాపాడుకొనుటకు ఆ యా ప్రదేశములలో నుండి తమకు విరోధులగు జనుల సైనికులనందరిని, శిశువులను స్త్రీలను కూడ, సంహరించి హతముచేసి నిర్మూలపరచి

లేవీయకాండము 26:7

మీరు మీ శత్రువులను తరిమెదరు; వారు మీ యెదుట ఖడ్గముచేత పడెదరు.

లేవీయకాండము 26:8

మీలో అయిదుగురు నూరుమందిని తరుముదురు; నూరుమంది పదివేలమందిని తరుముదురు, మీ శత్రువులు మీయెదుట ఖడ్గముచేత కూలుదురు.

ఆదికాండము 14:23

నని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా యెదుట నా చెయ్యియెత్తి ప్రమాణము చేసియున్నాను.

ఆదికాండము 34:27

తమ సహోదరిని చెరిపినందున యాకోబు కుమారులు చంపబడినవారు ఉన్నచోటికి వచ్చి ఆ ఊరు దోచుకొని

ఎస్తేరు 9:10

అరీసై అరీదై వైజాతా అను వారిని చంపిరి; అయితే కొల్లసొమ్ము వారు పట్టుకొనలేదు.

ఎస్తేరు 9:15

షూషనునందున్న యూదులు అదారు మాసమున పదు నాలుగవ దినమందు కూడుకొని, షూషనునందు మూడు వందలమందిని చంపివేసిరి; అయితే వారు కొల్లసొమ్ము పట్టుకొనలేదు.