ఎస్తేరు 9: 21
క్రాస్-రిఫరెన్స్‌లు
" యూదులు తమ పగవారిచేత బాధపడక నెమ్మదిపొందిన దినములనియు, వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల అనియు, వారు మూల్గుట మానిన శుభదినమనియు, ప్రతి సంవత్సరము అదారు నెల యొక్క పదునాలుగవ దినమును పదునైదవ దినమును వారు ఆచరించు కొనుచు"
సంబంధిత రిఫరెన్స్‌లు
కావున బహుకాలమునుండి వారు వ్రాయబడిన ప్రకారము ఇంత ఘనముగా నాచరింపకుండుట చూచి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు యెరూషలేములో పస్కాపండుగ ఆచరించుటకై రావలసినదని బెయేర్షెబా మొదలుకొని దాను వరకు ఇశ్రాయేలీయులుండు దేశమంతటను చాటింపవలెనని వారు నిర్ణయము చేసిరి.
రాజైన దర్యావేషు ఏలుబడియందు ఆరవ సంవత్సరము అదారు నెల మూడవనాటికి మందిరము సమాప్తి చేయబడెను.
రాజైన అహష్వేరోషు యొక్క యేలుబడియందు పండ్రెండవ సంవత్సరమున నీసాను మాసమున, అనగా, ప్రథమ మాసమున వారు హామాను ఎదుట పూరు, అనగా చీటిని దినదినమునకును నెలనెలకును అదారు అను పండ్రెండవ నెలవరకు వేయుచు వచ్చిరి.
పదునాలుగవ దినమందును వారు నెమ్మదిపొంది విందు చేసికొనుచు సంతోషముగా నుండిరి.