లేఖనాలను అన్వేషించండి

ఎస్తేరు 9: 18

క్రాస్-రిఫరెన్స్‌లు

" షూషనునందున్న యూదులు ఆ మాసమందు పదమూడవ దినమందును పదునాలుగవ దినమందును కూడుకొని పదునైదవ దినమందు నెమ్మదిపొంది విందు చేసికొనుచు సంతోషముగా నుండిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఎస్తేరు 9:1

రాజు చేసిన తీర్మానమును చట్టమును నెరవేరు కాలము వచ్చినప్పుడు అదారు అను పండ్రెండవ నెల పదమూడవ దినమున యూదులను జయింపగలుగుదుమని వారి పగవారు నిశ్చయించుకొనిన దినముననే యూదులు తమ పగవారిమీద అధికారము నొందినట్లు అగుపడెను.

ఎస్తేరు 9:11

ఆ దినమున షూషను కోటయందు చంపబడినవారి లెక్క రాజునకు తెలియజెప్పగా

ఎస్తేరు 9:13

ఎస్తేరు రాజవైన తమకు సమ్మతమైనయెడల ఈ దినము జరిగిన చొప్పున షూషనునందున్న యూదులు రేపును చేయునట్లుగాను, హామాను యొక్క పదిమంది కుమారులు ఉరికొయ్యమీద ఉరితీయింపబడునట్లుగాను సెలవియ్యుడనెను.

ఎస్తేరు 9:15

షూషనునందున్న యూదులు అదారు మాసమున పదు నాలుగవ దినమందు కూడుకొని, షూషనునందు మూడు వందలమందిని చంపివేసిరి; అయితే వారు కొల్లసొమ్ము పట్టుకొనలేదు.

ఎస్తేరు 9:17

పదునాలుగవ దినమందును వారు నెమ్మదిపొంది విందు చేసికొనుచు సంతోషముగా నుండిరి.