నిర్గమకాండము 12: 20
క్రాస్-రిఫరెన్స్‌లు
" మీరు పులిసినదేదియు తినక మీ నివాసములన్నిటిలోను పులియని వాటినే తినవలెనని చెప్పుమనెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఏడు దినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటి దినమున మీ యిండ్లలోనుండి పొంగినది పారవేయవలెను. మొదటి దినము మొదలుకొని యేడవ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుష్యుడు ఇశ్రాయేలీయులలోనుండి కొట్టివేయబడును.
నీవు పులిసినదానితో నా బలిరక్తమును అర్పింపకూడదు; పస్కా పండుగలోని బలిసంబంధమైన మాంసమును ఉదయకాలమువరకు ఉంచకూడదు.
మీరు యెహోవాకు చేయు నైవేద్యమేదియు పులిసి పొంగినదానితో చేయకూడదు. ఏలయనగా పులిసినదైనను తేనెయైనను యెహోవాకు హోమముగా దహింపవలదు.
పస్కాపండుగలో పొంగిన దేనినైనను తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తు దేశములోనుండి వచ్చితివి గదా. నీవు ఐగుప్తు దేశములోనుండి వచ్చిన దినమును నీ జీవితములన్నిటిలో జ్ఞాపకము చేసికొనునట్లు, బాధను స్మరణకుతెచ్చు పొంగని ఆహారమును ఏడు దినములు తినవలెను.