నిర్గమకాండము 12: 38
క్రాస్-రిఫరెన్స్‌లు
" అనేకులైన అన్యజనుల సమూహమును, గొఱ్ఱలు ఎద్దులు మొదలైన పశువుల గొప్పమందయును వారితోకూడ బయలుదేరెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
వారి మధ్యనున్న మిశ్రితజనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీయులును మరల ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు?
సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా ఆ దినములలో ఆ యా భాషలు మాటలాడు అన్యజనులలో పదేసిమంది యొక యూదుని చెంగుపట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడ వత్తుమని చెప్పుదురు.
ఇశ్రాయేలీయురాలగు ఒక స్త్రీకిని ఐగుప్తీయుడగు ఒక పురుషునికిని పుట్టినవాడొకడు ఇశ్రాయేలీయుల మధ్యకు వచ్చెను.
నేడు నిన్ను తనకు స్వజనముగా నియమించుకొని తానే నీకు దేవుడైయుండునట్లు నీ దేవుడైన యెహోవా నేడు నీకు నియమించుచున్న నీ దేవుడైన యెహోవా నిబంధనలోను ఆయన ప్రమాణము చేసినదానిలోను నీవు పాలుపొందుటకై ఇశ్రాయేలీయులలో ప్రతివాడు,
కాగా జనులు ధర్మశాస్త్రమును వినినప్పుడు మిశ్ర జనసమూహమును ఇశ్రాయేలీయులలోనుండి వెలివేసిరి.
మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి ఆయన వారి పశువులను తగ్గిపోనియ్యలేదు
సమస్తమైన మిశ్రిత జనులును ఊజు దేశపు రాజులందరును ఫిలిష్తీయుల దేశపు రాజులందరును అష్కెలోనును, గాజయును, ఎక్రోనును అష్డోదు శేషపువారును