లేఖనాలను అన్వేషించండి

నిర్గమకాండము 28: 15

క్రాస్-రిఫరెన్స్‌లు

" మరియు చిత్రకారుని పనిగా న్యాయవిధానపతకము చేయవలెను. ఏఫోదు పనివలె దాని చేయవలెను; బంగారుతోను నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోను పేనిన సన్ననారతోను దాని చేయవలెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

నిర్గమకాండము 28:4

పతకము ఏఫోదు నిలువుటంగీ విచిత్రమైన చొక్కాయి పాగా దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడై యుండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను.

నిర్గమకాండము 28:30

మరియు నీవు న్యాయవిధానపతకములో ఊరీము తుమ్మీము అనువాటిని ఉంచవలెను; అహరోను యెహోవా సన్నిధికి వెళ్లునప్పుడు అవి అతని రొమ్మున ఉండునట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేలీయుల న్యాయవిధానమును నిత్యము భరించును.

నిర్గమకాండము 39:8

మరియు అతడు ఏఫోదు పనివలె బంగారుతోను నీల ధూమ్ర రక్తవర్ణములుగల పంక్తులతోను సన్ననారతోను చిత్రకారుని పనిగా పతకమును చేసెను.

లేవీయకాండము 8:8

ఆ పతకములో ఊరీము తుమ్మీమను వాటిని ఉంచి

నిర్గమకాండము 28:6

బంగారుతోను నీల ధూమ్ర రక్త వర్ణములు గల ఏఫోదును పేనిన సన్ననారతోను చిత్రకారుని పనిగా చేయవలెను.

నిర్గమకాండము 26:1

మరియు నీవు పది తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పనియైన కెరూబులు గలవాటినిగా చేయవలెను.

నిర్గమకాండము 25:7

లేతపచ్చలు, ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములు అనునవే.

నిర్గమకాండము 26:31

మరియు నీవు నీల ధూమ్ర రక్తవర్ణములుగల ఒక అడ్డతెరను పేనిన సన్ననారతో చేయవలెను. అది చిత్రకారుని పనియైన కెరూబులు గలదిగా చేయవలెను.

నిర్గమకాండము 28:29

అట్లు అహరోను పరిశుద్ధస్థలములోనికి వెళ్లునప్పుడు అతడు తన రొమ్ముమీద న్యాయవిధానపతకములోని ఇశ్రాయేలీయుల పేళ్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలెను

నిర్గమకాండము 31:4

రత్నములను సాన బెట్టుటకును కఱ్ఱనుకోసి చెక్కుటకును

నిర్గమకాండము 35:6

నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్ననార మేక వెండ్రుకలు, ఎఱ్ఱరంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్రవత్సల తోళ్లు, తుమ్మకఱ్ఱ,

న్యాయాధిపతులు 17:5

మీకా అను ఆ మనుష్యునికి దేవమందిర మొకటి యుండెను. మరియు అతడు ఏఫోదును గృహదేవతలను చేయించి తన కుమారు లలో ఒకని ప్రతిష్ఠింపగా ఇతడు అతనికి యాజకుడాయెను.