యెహెజ్కేలు 11: 7
క్రాస్-రిఫరెన్స్‌లు
" కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా మీరు హతముచేసి పట్టణములో పడవేసిన శవములే మాంసము, ఈ పట్టణమే పచనపాత్ర, యీ పట్టణములోనుండి మిమ్మును వెళ్లగొట్టుదును."
సంబంధిత రిఫరెన్స్‌లు
దేశము రక్తముతో నిండియున్నది, పట్టణము బలాత్కారముతో నిండియున్నది. సంకెళ్లు సిద్ధపరచుము.
ఆయన నాకీలాగు సెలవిచ్చెను ఇశ్రాయేలు వారి యొక్కయు యూదావారి యొక్కయు దోషము బహు ఘోరముగా ఉన్నది; వారు యెహోవా దేశమును విసర్జించెననియు ఆయన మమ్మును కానడనియు ననుకొని, దేశమును హత్యతోను పట్టణమును తిరుగుబాటుతోను నింపియున్నారు.
నరపుత్రుడా, ప్రాణహాని చేయు ఈ పట్టణమునకు నీవు తీర్పు తీర్చుదువా? దానికి నీవు తీర్పు తీర్చునెడల అదిచేయు హేయక్రియలన్నిటిని దానికి తెలియజేసి యీలాగున ప్రకటింపవలెను.
ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నీ కాలము వచ్చునట్లు నరహత్యలు చేయు పట్టణమా, నిన్ను అపవిత్రపరచుకొనునట్లు విగ్రహములు పెట్టుకొను పట్టణమా, నీవు చేసిన నరహత్యలచేత నీకు నీవే నేరస్థాపన చేసికొంటివి, నీవు పెట్టుకొనిన విగ్రహములచేత నిన్ను నీవే అపవిత్రపరచుకొంటివి,
నీకు నీవే శిక్ష తెప్పించుకొంటివి, శిక్షా సంవత్సరములు వచ్చుటకు నీవే కారణమైతివి. కాబట్టి అన్యజనములలో నిందాస్పదముగాను, సకలదేశములలో అపహాస్యాస్పదముగాను నిన్ను నియమించుచున్నాను.
సమీపస్థులేమి దూరస్థులేమి అందరును అపకీర్తి పొందినదానవనియు అల్లరితో నిండినదానవనియు నిన్ను అపహసింతురు.
నీలోని ఇశ్రాయేలీయుల ప్రధానులందరును తమ శక్తికొలది నరహత్య చేయుదురు,
కొండెములు చెప్పి నరహత్య చేయువారు నీలో కాపురమున్నారు, పర్వతములమీద భోజనము చేయువారు నీ మధ్య నివసించుచున్నారు, నీలో కామ వికార చేష్టలు జరుగుచున్నవి.
నన్ను మరచిపోయి నరహత్యకై లంచము పుచ్చుకొనువారు నీలో నున్నారు, అప్పిచ్చి వడ్డి పుచ్చుకొని నీ పొరుగువారిని బాధించుచు నీవు బలవంతముగా వారిని దోచుకొనుచున్నావు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
దానిలో అధిపతులు లాభము సంపాదించుటకై నరహత్య చేయుటలోను మనుష్యులను నశింపజేయుటలోను వేటను చీల్చు తోడేళ్లవలె ఉన్నారు.
కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నరహంతకులున్న పట్టణమునకు శ్రమ; మడ్డిగల కుండా, మానకుండ మడ్డిగలిగియుండు కుండా, నీకు శ్రమ; చీటి దాని వంతున పడలేదు, వండినదానిని ముక్కవెంబడి ముక్కగా దానిలోనుండి తీసికొనిరమ్ము.
దానిచేత చిందింపబడిన రక్తము దానిలో కనబడుచున్నది, మట్టితో దాని కప్పివేయునట్లు దానిని నేలమీద కుమ్మరింపక వట్టి బండమీద దానిని చిందించెను.
కావున నా క్రోధము రానిచ్చి, నేను ప్రతికారము చేయునట్లు అది చిందించిన రక్తము కప్పబడకుండ దానిని వట్టిబండమీద నేనుండనిచ్చితిని.
ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నరహంతకులున్న పట్టణమునకు శ్రమ, నేనును విస్తరించి కట్టెలు పేర్చబోవుచున్నాను.
మరియు మనష్షే యెహోవా దృష్టికి చెడు నడత నడిచి, యూదావారిని పాపములో దింపినది గాక యెరూషలేమును ఈ కొననుండి ఆ కొనవరకు రక్తముతో నిండునట్లు నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించెను.
మీరు మీచేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థనచేసినను నేను వినను మీచేతులు రక్తముతో నిండియున్నవి.
నేను మీ పిల్లలను హతము చేయుట వ్యర్థమే; వారు శిక్షకు లోబడరు; నాశనవాంఛగల సింహమువలె మీ ఖడ్గము మీ ప్రవక్తలను సంహరించుచున్నది.
మరియు నిర్ధోషులైన దీనుల ప్రాణరక్తము నీ బట్ట చెంగులమీద కనబడుచున్నది; కన్నములలోనే కాదు గాని నీ బట్టలన్నిటిమీదను కనబడుచున్నది.
పరదేశులను తండ్రిలేనివారిని విధవరాండ్రను బాధింపకయు ఈ చోట నిర్దోషిరక్తము చిందింపకయు, మీకు కీడు కలుగజేయు అన్యదేవతలను అనుసరింపకయు నుండినయెడల
ఇదేమి? మీరు జారచోర క్రియలను నరహత్యను చేయుచు
దానిలో నీతిమంతుల రక్తమును ఓడ్చిన దాని ప్రవక్తల పాపములనుబట్టియు దాని యాజకుల దోషమునుబట్టియు
అబద్ధసాక్ష్యము పలుకుటయు అబద్ధమాడుటయు హత్య చేయుటయు దొంగిలించుటయు వ్యభిచరించుటయు వాడుకయ్యెను; జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేసెదరు.
కాబట్టి దేశము ప్రలాపించుచున్నది, దాని పశువులును ఆకాశపక్షులును కాపురస్థులందరును క్షీణించుచున్నారు, సముద్ర మత్స్యములు కూడ గతించిపోవుచున్నవి.
అయినను మేలు నసహ్యించుకొని కీడుచేయ నిష్టపడుదురు, నా జనుల చర్మము ఊడదీసి వారి యెముకలమీది మాంసము చీల్చుచుందురు.
నా జనుల మాంసమును భుజించుచు వారి చర్మమును ఒలిచి వారి యెముకలను విరిచి, ఒకడు కుండలోవేయు మాంసమును ముక్కలు చేయునట్టు బానలోవేయు మాంసముగా వారిని తుత్తునియలుగా పగులగొట్టియున్నారు.
నరహత్య చేయుటచేత సీయోనును మీరు కట్టుదురు. దుష్టత్వము జరిగించుటచేత యెరూషలేమును మీరు కట్టుదురు.
భక్తుడు దేశములో లేకపోయెను, జనులలో యథార్థపరుడు ఒకడును లేడు, అందరును ప్రాణహాని చేయుటకై పొంచియుండువారే; ప్రతిమనుష్యుడును కిరాతుడై తన సహోదరునికొరకు వలలను ఒగ్గును.
దాని మధ్య దాని అధిపతులు గర్జనచేయు సింహములు, దాని న్యాయాధిపతులు రాత్రియందు తిరుగులాడుచు తెల్లవారువరకు ఎరలో ఏమియు మిగులకుండ భక్షించు తోడేళ్లు.
నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును, దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జెకర్యా రక్తమువరకు భూమిమీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును.
అప్పుడాయన నాతో ఇట్లనెను నరపుత్రుడా, నీవు చూచితివే; యూదావారు ఇక్కడ ఇట్టి హేయ కృత్యములు జరిగించుట చాలదా? వారు దేశమును బలాత్కారముతో నింపుచు నాకు కోపము పుట్టించుదురు, తీగె ముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపము పుట్టించుదురు.