లేఖనాలను అన్వేషించండి

యెహెజ్కేలు 30: 23

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఐగుప్తీయులను జనములలోనికి చెదరగొట్టుదును, ఆ యా దేశములకు వారిని వెళ్లగొట్టుదును."

సంబంధిత రిఫరెన్స్‌లు

యెహెజ్కేలు 29:3

ఐగుప్తు రాజైన ఫరో, నైలునదిలో పండుకొనియున్న పెద్దమొసలీ, నేను నీకు విరోధిని; నైలునది నాది, నేనే దాని కలుగజేసితిని అని నీవు చెప్పుకొనుచున్నావే;

యిర్మియా 46:25

ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నోలోనుండు ఆమోను దేవతను ఫరోను ఐగుప్తును దాని దేవతలను దాని రాజులను ఫరోను అతని నాశ్రయించువారిని నేను దండించుచున్నాను.

కీర్తనలు 37:17

భక్తిహీనుల బాహువులు విరువబడును నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు

యెహెజ్కేలు 34:16

తప్పిపోయిన దానిని నేను వెదకుదును, తోలివేసిన దానిని మరల తోలుకొని వచ్చెదను, గాయపడినదానికి కట్టు కట్టుదును, దుర్బలముగా ఉన్నదానిని బలపరచుదును; అయితే క్రొవ్వినవాటికిని బలముగలవాటికిని శిక్షయను మేతపెట్టి లయపరచెదను.

2రాజులు 24:7

బబులోనురాజు ఐగుప్తు నదికిని యూఫ్రటీసు నదికిని మధ్య ఐగుప్తు రాజు వశముననున్న భూమియంతటిని పట్టుకొనగా ఐగుప్తు రాజు ఇకనెన్నటికిని తన దేశము విడిచి బయలుదేరుట మానెను.

యిర్మియా 37:7

ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా నాయొద్ద విచారించుడని నిన్ను నాయొద్దకు పంపిన యూదా రాజుతో నీవీలాగు చెప్పవలెను మీకు సహాయము చేయుటకై బయలుదేరి వచ్చుచున్న ఫరోదండు తమ స్వదేశమైన ఐగుప్తులోనికి తిరిగివెళ్లును.

యిర్మియా 46:1

అన్యజనులనుగూర్చి ప్రవక్తయైన యిర్మీయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు

యిర్మియా 46:2

ఐగుప్తునుగూర్చిన మాట, అనగా యోషీయా కుమారుడును యూదా రాజునైన యెహోయాకీము ఏలుబడియందు నాలుగవ సంవత్సరమున నెబుకద్రెజరు కర్కెమీషులో యూఫ్రటీసు నదిదగ్గర ఓడించిన ఫరోనెకో దండునుగూర్చిన మాట.

యిర్మియా 46:3

డాలును కేడెమును స్థిరపరచుకొనుడి యుద్ధమునకు రండి

యిర్మియా 46:4

గుఱ్ఱములను కట్టుడి, రౌతులారా, కవచము తొడిగి ఎక్కుడి శిరస్త్రాణములను ధరించుకొనుడి ఈటెలకు పదును పెట్టుడి కవచములు వేసికొనుడి.

యిర్మియా 46:5

నాకేమి కనబడుచున్నది? వారు ఓడిపోవుచున్నారు వెనుకతీయుచున్నారు వారి బలాఢ్యులు అపజయము నొందుచున్నారు తిరిగిచూడక వేగిరముగా పారిపోవుచున్నారు ఎటుచూచిన భయమే; యెహోవా మాట యిదే.

యిర్మియా 46:6

త్వరగ పరుగెత్తువారు పారిపోజాలకున్నారు బలాఢ్యులు తప్పించుకొనజాలకున్నారు ఉత్తరదిక్కున యూఫ్రటీసు నదీతీరమందు వారు తొట్రిల్లిపడుచున్నారు.

యిర్మియా 46:7

నైలునదీ ప్రవాహమువలె వచ్చు నితడెవడు? ఇతని జలములు నదులవలె ప్రవహించుచున్నవి

యిర్మియా 46:8

ఐగుప్తీయుల దండు నైలునదివలె ప్రవహించుచున్నది. దాని జలములు తొణకునట్లుగా అది వచ్చుచున్నది. నేనెక్కి భూమిని కప్పెదను పట్టణమును దాని నివాసులను నాశనము చేసెదను.

యిర్మియా 46:9

గుఱ్ఱములారా, యెగురుడి; రథములారా, రేగుడి బలాఢ్యులారా, బయలుదేరుడి డాళ్లు పట్టుకొను కూషీయులును పూతీయులును విలుకాండ్రైన లూదీయులును బయలుదేరవలెను.

యిర్మియా 46:10

ఇది ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవాకు పగతీర్చు దినము. ఆయన తన శత్రువులకు ప్రతిదండన చేయును ఖడ్గము కడుపార తినును, అది తనివితీర రక్తము త్రాగును. ఉత్తర దేశములో యూఫ్రటీసు నదియొద్ద ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా బలి జరిగింపబోవుచున్నాడు.

యిర్మియా 46:11

ఐగుప్తు కుమారీ, కన్యకా, గిలాదునకు వెళ్లి గుగ్గిలము తెచ్చుకొనుము విస్తారమైన ఔషధములు తెచ్చుకొనుట వ్యర్థమే నీకు చికిత్స కలుగదు

యిర్మియా 46:12

నీకు సిగ్గుకలిగిన సంగతి జనములకు వినబడెను నీ రోదనధ్వని దేశమందంతట వినబడుచున్నది బలాఢ్యులు బలాఢ్యులను తగిలి కూలుచున్నారు ఒకనిమీద ఒకడు పడి అందరు కూలుదురు.

యిర్మియా 46:21

పరదేశులైన ఆమె కూలి సిఫాయిలు పెంపుడు దూడలవలె ఉన్నారు వారేగదా వెనుకతట్టు తిరిగిరి యొకడును నిలువకుండ పారిపోయిరి వారికి ఆపద్దినము వచ్చియున్నది శిక్షాదినము వారికాసన్నమాయెను.

యిర్మియా 46:22

శత్రువులు దండెత్తి వచ్చుచున్నారు మ్రానులు నరుకువారివలె గొడ్డండ్లు పట్టుకొని దానిమీదికి వచ్చుచున్నారు ఆలకించుడి ఆమె ధ్వని ప్రాకిపోవు పాము చప్పుడువలె వినబడుచున్నది యెహోవా వాక్కు ఇదే

యిర్మియా 46:23

లెక్కలేనివారై మిడతలకన్న విస్తరింతురు చొరశక్యముకాని ఆమె అరణ్యమును నరికివేయుదురు.

యిర్మియా 46:24

ఐగుప్తు కూమారి అవమానపరచబడును ఉత్తర దేశస్థులకు ఆమె అప్పగింపబడును

యిర్మియా 46:25

ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నోలోనుండు ఆమోను దేవతను ఫరోను ఐగుప్తును దాని దేవతలను దాని రాజులను ఫరోను అతని నాశ్రయించువారిని నేను దండించుచున్నాను.

యోబు 22:9

విధవరాండ్రను వట్టిచేతులతో పంపివేసితివి తండ్రిలేనివారిచేతులు విరుగగొట్టితివి.

యోబు 38:15

దుష్టుల వెలుగు వారియొద్దనుండి తీసివేయబడును వారెత్తిన బాహువు విరుగగొట్టబడును.

కీర్తనలు 10:15

దుష్టుల భుజమును విరుగగొట్టుము చెడ్డవారి దుష్టత్వము ఏమియు కనబడకపోవువరకు దానినిగూర్చి విచారణ చేయుము.

యెహెజ్కేలు 32:11

ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా బబులోనురాజు ఖడ్గము నీమీదికి వచ్చును,

నహూము 3:19

నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది, నీ గాయమునకు చికిత్స ఎవడును చేయజాలడు, జనులందరు ఎడతెగక నీచేత హింసనొందిరి, నిన్నుగూర్చిన వార్త వినువారందరు నీ విషయమై చప్పట్లు కొట్టుదురు.

జెకర్యా 11:17

మందను విడనాడు పనికిమాలిన కాపరికి శ్రమ; అతని చెయ్యియు కుడికన్నును తెగవేయబడును; అతని చెయ్యి బొత్తిగా ఎండిపోవును అతని కుడికంటికి దృష్టి బొత్తిగా తప్పును.