లేఖనాలను అన్వేషించండి

యెహెజ్కేలు 30: 24

క్రాస్-రిఫరెన్స్‌లు

" మరియు బబులోను రాజుయొక్క చేతులను బలపరచి నా ఖడ్గము అతని చేతికిచ్చెదను, ఫరోయొక్క చేతులను నేను విరిచినందున బబులోనురాజు చూచుచుండగా ఫరో చావుదెబ్బ తినినవాడై మూల్గులిడును. "

సంబంధిత రిఫరెన్స్‌లు

యెహెజ్కేలు 30:17

ఓనువారిలోను పిబేసెతు వారిలోను యౌవనులు ఖడ్గముచేత కూలుదురు. ఆ పట్టణస్థులు చెరలోనికి పోవుదురు.

యెహెజ్కేలు 30:18

ఐగుప్తుపెట్టిన కాండ్లను నేను తహపనేసులో విరుచు దినమున చీకటికమ్మును, ఐగుప్తీయుల బలగర్వము అణచబడును, మబ్బు ఐగుప్తును కమ్మును, దాని కుమార్తెలు చెరలోనికి పోవుదురు.

యెహెజ్కేలు 30:26

నేనే యెహోవానై యున్నానని వారు తెలిసికొనునట్లు నేను ఐగుప్తీయులను జనములలోనికి చెదరగొట్టి ఆ యా దేశములకు వారిని వెళ్లగొట్టుదును.

యెహెజ్కేలు 29:12

నిర్మానుష్యముగానున్న దేశముల మధ్యను ఐగుప్తు దేశమును పాడగునట్టుగా చేసెదను, పాడైపోయిన పట్టణములమధ్యను దాని పట్టణములు నలువది సంవత్సరములు పాడైయుండును, ఐగుప్తీయులను జనములలోనికి చెదరగొట్టుదును, ఆ యా దేశములకు వారిని వెళ్లగొట్టుదును.

యెహెజ్కేలు 29:13

ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు నలువది సంవత్సరములు జరిగిన తరువాత ఐగుప్తీయులు చెదరిపోయిన జనులలోనుండి నేను వారిని సమకూర్చెదను.

యెహెజ్కేలు 32:9

నీవు ఎరుగని దేశములలోనికి నేను నిన్ను వెళ్లగొట్టి, జనములలో నీకు సమూలధ్వంసము కలుగజేసి బహు జనములకు కోపము పుట్టింతును,