లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 10: 8

క్రాస్-రిఫరెన్స్‌లు

" కూషు నిమ్రోదును కనెను. అతడు భూమిమీద పరాక్రమశాలియై యుండుటకు ఆరంభించెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

మీకా 5:6

వారు అష్షూరు దేశమును, దాని గుమ్మముల వరకు నిమ్రోదు దేశమును ఖడ్గముచేత మేపుదురు, అష్షూరీయులు మన దేశములో చొరబడి మన సరిహద్దులలో ప్రవేశించినప్పుడు ఆయన యీలాగున మనలను రక్షించును.

1దినవృత్తాంతములు 1:10

కూషు నిమ్రోదును కనెను, ఇతడు భూమిమీది పరాక్రమశాలులలో మొదటివాడు.

కీర్తనలు 52:1

శూరుడా, చేసిన కీడునుబట్టి నీ వెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును.

యెషయా 18:2

అది సముద్రమార్గముగా జలములమీద జమ్ము పడవలలో రాయబారులను పంపుచున్నది వేగిరపడు దూతలారా, యెత్తయినవారును నునుపైన చర్మముగలవారునగు జనమునొద్దకు దూరములోనున్న భీకరజనమునొద్దకు పోవుడి. నదులు పారుచున్న దేశముగలవారును దౌష్టికులై జనములను త్రొక్కుచుండువారునగు జనమునొద్దకు పోవుడి.