లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 42: 34

క్రాస్-రిఫరెన్స్‌లు

" నాయొద్దకు ఆ చిన్నవాని తోడుకొనిరండి. అప్పుడు మీరు యథార్థవంతులే గాని వేగులవారు కారని నేను తెలిసికొని మీ సహోదరుని మీకప్పగించెదను; అప్పుడు మీరు ఈ దేశమందు వ్యాపారము చేసికొనవచ్చునని చెప్పెననిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 34:10

ఈ దేశము మీ యెదుట ఉన్నది; ఇందులో మీరు నివసించి వ్యాపారము చేసి ఆస్తి సంపాదించుకొనుడని చెప్పెను.

ఆదికాండము 34:21

ఈ మనుష్యులు మనతో సమాధానముగా నున్నారు గనుక వారిని ఈ దేశమందు ఉండనిచ్చి యిందులో వ్యాపారము చేయనియ్యుడి; ఈ భూమి వారికిని చాలినంత విశాలమైయున్నది గదా, మనము వారి పిల్లలను పెండ్లి చేసికొని మన పిల్లలను వారికి ఇత్తము

1రాజులు 10:15

ఇదియు గాక గంధవర్గములు మొదలైనవి వర్తకుల యొద్దనుండియు అరబి రాజుల యొద్దనుండియు దేశాధికారుల యొద్దనుండియు అతనికి చాలా వచ్చుచుండెను.

యెహెజ్కేలు 17:4

అది దాని లేతకొమ్మల చిగుళ్లను త్రుంచి వర్తకదేశమునకు కొనిపోయి వర్తకులున్న యొక పురమందు దానిని నాటెను.

ఆదికాండము 42:9

యోసేపు వారినిగూర్చి తాను కనిన కలలు జ్ఞాపకము చేసికొని మీరు వేగులవారు ఈ దేశము గుట్టు తెలిసికొన వచ్చితిరని వారితోననగా

ఆదికాండము 42:11

మేమందరము ఒక్క మనుష్యుని కుమారులము; మేము యథార్థవంతులమే గాని నీ దాసులమైన మేము వేగులవారము కామని అతనితో చెప్పిరి.

ఆదికాండము 42:15

దీనివలన మీ నిజము తెలియబడును; ఫరో జీవముతోడు, మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనే గాని మీరిక్కడనుండి వెళ్లకూడదు.

ఆదికాండము 42:20

మీ తమ్ముని నాయొద్దకు తీసికొనిరండి; అట్లు మీ మాటలు సత్యమైనట్టు కనబడును గనుక మీరు చావరని చెప్పెను. వారట్లు చేసిరి.

ఆదికాండము 43:3

యూదా అతని చూచి ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే గాని మీరు నా ముఖము చూడకూడదని మాతో గట్టిగా చెప్పెను.