లేఖనాలను అన్వేషించండి

యెషయా 22: 11

క్రాస్-రిఫరెన్స్‌లు

" పాత కోనేటి నీళ్లు నిలుచుటకు ఆ రెండు గోడల మధ్యను చెరువు కట్టితిరి అయినను దాని చేయించిన వానివైపు మీరు చూచిన వారు కారు పూర్వకాలమున దాని నిర్మించినవానిని మీరు లక్ష్యపెట్టకపోతిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

ద్వితియోపదేశాకాండము 32:18

నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి. నిన్ను కనిన దేవుని మరచితివి.

2దినవృత్తాంతములు 11:11

దుర్గములను బలపరచి, వాటిలో అధిపతులను ఉంచి, ఆహారమును నూనెను ద్రాక్షారసమును సమకూర్చెను.

2దినవృత్తాంతములు 32:5

మరియు రాజు ధైర్యము తెచ్చుకొని, పాడైన గోడ యావత్తు కట్టించి, గోపురములవరకు దానిని ఎత్తు చేయించి, బయట మరియొక గోడను కట్టించి, దావీదు పట్టణములో మిల్లో దుర్గమును బాగుచేయించెను. మరియు ఈటెలను డాళ్లను విస్తారముగా చేయించెను.

యెహెజ్కేలు 21:20

ఖడ్గమునకు అమ్మోనీయుల పట్టణమగు రబ్బాకు ఒక మార్గమును, యూదాదేశమందున్న ప్రాకారములు గల పట్టణమగు యెరూషలేమునకు ఒక మార్గమును ఏర్పరచుము.