లేఖనాలను అన్వేషించండి

యెషయా 51: 23

క్రాస్-రిఫరెన్స్‌లు

" నిన్ను బాధపరచువారి చేతిలో దాని పెట్టెదను మేము దాటిపోవునట్లు క్రిందికి వంగి సాగిలపడుమని వారు నీతో చెప్పగా నీవు నీ వీపును దాటువారికి దారిగాచేసి నేలకు దానిని వంచితివి గదా వారికే ఆ పాత్రను త్రాగనిచ్చెదను. "

సంబంధిత రిఫరెన్స్‌లు

1సమూయేలు 25:39

నాబాలు చనిపోయెనని దావీదు విని యెహోవా నాబాలు చేసిన కీడును అతని తలమీదికి రప్పించెను గనుక తన దాసుడనైన నేను కీడు చేయకుండ నన్ను కాపాడి, నాబాలువలన నేను పొందిన అవమానమును తీర్చిన యెహోవాకు స్తోత్రము కలుగును గాక అనెను. తరువాత దావీదు అబీగయీలును పెండ్లి చేసికొనవలెనని ఆమెతో మాటలాడ తగినవారిని పంపెను.

కీర్తనలు 35:1

యెహోవా, నాతో వ్యాజ్యెమాడు వారితో వ్యాజ్యెమాడుము నాతో పోరాడువారితో పోరాడుము.

సామెతలు 22:23

యెహోవా వారి పక్షమున వ్యాజ్యెమాడును ఆయన వారిని దోచుకొనువారి ప్రాణమును దోచుకొనును.

యిర్మియా 50:34

వారి విమోచకుడు బలవంతుడు సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు భూమికి విశ్రాంతి కలుగజేయుటకును బబులోను నివాసులను కలవరపరచుటకును ఆయన బాగుగా వాదించి వారి వ్యాజ్యెమును కడ ముట్టించును.

యిర్మియా 51:36

యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆల కించుము, నీ వ్యాజ్యెమును నేను జరిగించుదును నీ నిమిత్తము నేనే పగతీర్చుకొందును దాని సముద్రమును నేనెండకట్టుదును దాని ఊటను ఇంకిపోజేయుదును.

యోవేలు 3:2

అన్యజనులనందరిని సమకూర్చి, యెహోషాపాతు లోయలోనికి తోడుకొనిపోయి, వారు ఆ యా దేశములలోనికి నా స్వాస్థ్యమగు ఇశ్రాయేలీయులను చెదరగొట్టి, నా దేశమును తాము పంచుకొనుటనుబట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్యజనులతో వ్యాజ్యెమాడుదును.

మీకా 7:9

నేను యెహోవా దృష్టికి పాపము చేసితిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యెమాడి నా పక్షమున న్యాయము తీర్చువరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును; ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను.

యెషయా 51:17

యెరూషలేమా, లెమ్ము లెమ్ము యెహోవా క్రోధపాత్రను ఆయన చేతినుండి పుచ్చుకొని త్రాగినదానా, తూలిపడజేయు పాత్రలోనిదంతటిని త్రాగినదానా, నిలువుము.

యెషయా 54:7

నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించితిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను

యెషయా 54:8

మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

యెషయా 54:9

నోవహు కాలమున జలప్రళయమునుగూర్చి నేను చేసినట్లు చేయుదును జలములు భూమిమీదికి ఇకను పొర్లుచురావని నోవహుకాలమున నేను ఒట్టుపెట్టుకొనినట్లు నీమీద కోపముగా నుండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొనియున్నాను.

యెషయా 62:8

యెహోవా ఈలాగున ప్రమాణము చేసెను నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేనియ్యను నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులు త్రాగరు.

యెహెజ్కేలు 39:29

అప్పుడు ఇశ్రాయేలీయులమీద నేను నా ఆత్మను కుమ్మరించెదను గనుక నేనికను వారికి పరాజ్ముఖుడనై యుండను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

కీర్తనలు 11:6

దుష్టులమీద ఆయన ఉరులు కురిపించును అగ్నిగంధకములును వడగాలియు వారికి పానీయభాగమగును.

కీర్తనలు 60:3

నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసితివి తూలునట్లు చేయు మద్యమును మాకు త్రాగించితివి

కీర్తనలు 75:8

యెహోవా చేతిలో ఒక పాత్రయున్నది అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది, అది సంబారముతో నిండియున్నది ఆయన దానిలోనిది పోయుచున్నాడు భూమిమీదనున్న భక్తిహీనులందరు మడ్డితోకూడ దానిని పీల్చి మింగివేయవలెను.

యెషయా 3:1

ఆలకించుడి ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా పోషణమును పోషణాధారమును అన్నోదకముల ఆధారమంతయు పోషణమంతయు

యెషయా 26:13

యెహోవా, మా దేవా, నీవు గాక వేరు ప్రభువులు మమ్ము నేలిరి ఇప్పుడు నిన్నుబట్టియే నీ నామమును స్మరింతుము

యెషయా 29:9

జనులారా, తేరి చూడుడి విస్మయమొందుడి మీ కండ్లను చెడగొట్టుకొనుడి గ్రుడ్డివారగుడి ద్రాక్షారసము లేకయే వారు మత్తులైయున్నారు మద్యపానము చేయకయే తూలుచున్నారు.

యెషయా 49:17

నీ కుమారులు త్వరపడుచున్నారు నిన్ను నాశనముచేసి నిన్ను పాడుచేసినవారు నీలోనుండి బయలువెళ్లుచున్నారు.

యిర్మియా 25:15

ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాకీలాగు సెలవిచ్చుచున్నాడు నీవు ఈ క్రోధపు మద్యపాత్రను నాచేతిలోనుండి తీసికొని, నేను నిన్ను పంపుచున్న జనములన్నిటికి దాని త్రాగింపుము.

యిర్మియా 30:20

వారి కుమారులు మునుపటివలెనుందురు, వారి సమాజము నా యెదుట స్థాపింపబడును, వారిని బాధపరచువారినందరిని శిక్షించెదను.

యిర్మియా 31:40

శవములును బూడిదయు వేయబడు లోయ అంతయు కిద్రోను వాగువరకును గుఱ్ఱముల గవినివరకును తూర్పుదిశనున్న పొలములన్నియు యెహోవాకు ప్రతిష్ఠితములగును. అది మరి ఎన్నడును పెల్లగింపబడదు, పడద్రోయబడదు.

యిర్మియా 51:24

బబులోనును కల్దీయుల దేశనివాసులును మీ కన్నులయెదుట సీయోనులో చేసిన కీడంతటికి నేను వారికి ప్రతికారము చేయుచున్నాను, ఇదే యెహోవా వాక్కు.

విలాపవాక్యములు 1:21

నేను నిట్టూర్పు విడుచుట విని నన్నాదరించువాడొకడును లేడాయెను నీవు నాకు ఆపద కలుగజేసితివన్న వార్త నా విరోధులందరు విని సంతోషించుచున్నారు. నీవు చాటించిన దినమును నీవు రప్పించుదువు అప్పుడు వారు నన్ను పోలియుండెదరు.

విలాపవాక్యములు 3:34

దేశమునందు చెరపట్టబడినవారినందరిని కాళ్లక్రింద త్రొక్కుటయు

యెహెజ్కేలు 23:33

నీ అక్కయైన షోమ్రోను పాత్ర వినాశోపద్రవములతో నిండినది, నీవు దానిలోనిది త్రాగి మత్తురాలవై దుఃఖముతో నింపబడుదువు.

ఓబధ్యా 1:16

మీరు నా పరిశుద్ధమైన కొండమీద త్రాగినట్లు అన్యజనులందరును నిత్యము త్రాగుదురు; తాము ఇకనెన్నడు నుండని వారైనట్లు వారేమియు మిగులకుండ త్రాగుదురు.

మీకా 7:10

నా శత్రువు దాని చూచును. నీ దేవుడైన యెహోవా యెక్కడనని నాతో అనినది అవమానము నొందును, అది నా కండ్లకు అగపడును, ఇప్పుడు అది వీధిలోనున్న బురదవలె త్రొక్కబడును.

నహూము 1:12

యెహోవా సెలవిచ్చునదేమనగా వారు విస్తారజనమై పూర్ణబలము కలిగియున్నను కోతయందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు; నేను నిన్ను బాధపరచితినే, నేను నిన్నిక బాధపెట్టను.

జెఫన్యా 3:15

తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసియున్నాడు; మీ శత్రువులను ఆయన వెళ్లగొట్టియున్నాడు; ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు.

జెఫన్యా 3:19

ఆ కాలమున నిన్ను హింసపెట్టువారినందరిని నేను శిక్షింతును, కుంటుచు నడుచువారిని నేను రక్షింతును, చెదరగొట్టబడినవారిని సమకూర్చుదును, ఏ యే దేశములలో వారు అవమానము నొందిరో అక్కడనెల్ల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసెదను,

జెకర్యా 6:8

అప్పుడతడు నన్ను పిలిచి ఉత్తర దేశములోనికి పోవువాటిని చూడుము; అవి ఉత్తర దేశమందు నా ఆత్మను నెమ్మదిపరచునని నాతో అనెను.

జెకర్యా 12:1

దేవోక్తి ఇశ్రాయేలీయులనుగూర్చి వచ్చిన యెహోవా వాక్కు. ఆకాశమండలమును విశాలపరచి భూమికి పునాదివేసి మనుష్యుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చునదేమనగా

జెకర్యా 12:2

నేను యెరూషలేము చుట్టునున్న జనులకందరికి మత్తు పుట్టించు పాత్రగా చేయబోవుచున్నాను; శత్రువులు యెరూషలేమునకు ముట్టడివేయగా అది యూదా మీదికిని వచ్చును.

మార్కు 10:38

యేసు మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు; నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటయైనను, నేను పొందుచున్న బాప్తిస్మము పొందుటయైనను మీచేత అగునా? అని వారినడుగగా వారు మాచేత అగుననిరి.

లూకా 22:42

వారియొద్ద నుండి రాతివేత దూరము వెళ్లి మోకాళ్లూని

ప్రకటన 14:10

ఏమియు కలపబడకుండ దేవుని ఉగ్రతపాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల యెదుటను గొఱ్ఱపిల్ల యెదుటను అగ్నిగంధకములచేత వాడు బాధింపబడును.

ప్రకటన 16:6

దీనికి వారు పాత్రులే. నీవు ఈలాగు తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని.