లేఖనాలను అన్వేషించండి

యెషయా 7: 11

క్రాస్-రిఫరెన్స్‌లు

" నీ దేవుడైన యెహోవా వలన సూచన నడుగుము. అది పాతాళమంత లోతైనను సరే ఊర్థ్వలోకమంత ఎత్తయినను సరే."

సంబంధిత రిఫరెన్స్‌లు

యెషయా 1:5

నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేల ఇంకను కొట్టబడుదురు? ప్రతివాడు నడినెత్తిని వ్యాధి గలిగియున్నాడు ప్రతివాని గుండె బలహీనమయ్యెను.

యెషయా 1:13

మీ నైవేద్యము వ్యర్థము అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము దానినికను తేకుడి అమావాస్యయు విశ్రాంతిదినమును సమాజకూట ప్రకటనమును జరుగుచున్నవి పాపులగుంపుకూడిన ఉత్సవసమాజమును నే నోర్చజాలను.

యెషయా 8:5

మరియు యెహోవా ఇంకను నాతో ఈలాగు సెలవిచ్చెను

యెషయా 10:20

ఆ దినమున ఇశ్రాయేలు శేషమును యాకోబు కుటుంబికులలో తప్పించుకొనినవారును తమ్మును హతము చేసినవానిని ఇకను ఆశ్రయింపక సత్యమునుబట్టి ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడైన యెహోవాను నిజముగా ఆశ్రయించెదరు.

హోషేయ 13:2

ఇప్పుడు వారు పాపము పెంపు చేయుదురు, తమకు తోచినట్టు వెండితో విగ్రహములను పోత పోయుదురు, అదంతయు పనివారు చేయు పనియే, వాటికి బలులను అర్పించువారు దూడలను ముద్దు పెట్టుకొనుడని చెప్పుదురు.