యిర్మియా 13: 7
క్రాస్-రిఫరెన్స్‌లు
" నేను యూఫ్రటీసునొద్దకు పోయి త్రవ్వి ఆ నడికట్టును దాచిపెట్టినచోటనుండి దాని తీసికొంటిని; నేను దానిని చూడగా ఆ నడికట్టు చెడిపోయియుండెను; అది దేనికిని పనికిరానిదాయెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
కావున యెహోవా మాటచొప్పున నేను నడికట్టు ఒకటి కొని నడుమున కట్టుకొంటిని.
రెండవమారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై
నీవు కొని నడుమున కట్టుకొనిన నడికట్టును తీసికొని, లేచి యూఫ్రటీసునొద్దకు పోయి అక్కడ నున్న బండబీటలో దానిని దాచిపెట్టుమనగా
యెహోవా నాకాజ్ఞాపించినట్లు నేను పోయి యూఫ్రటీసునొద్ద దాని దాచిపెట్టితిని.
నేను చూచుచుండగా కెరూబులకు పైగానున్న ఆకాశమండలము వంటిదానిలో నీలకాంతమయమైన సింహాసనమువంటిదొకటి అగుపడెను.
బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనను నాకొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును; పురాతనకాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను.
కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి, యీ తెగుళ్లమీద అధికారముగల దేవుని నామమును దూషించిరి గాని, ఆయనను మహిమపరచునట్లు వారు మారుమనస్సు పొందినవారు కారు.