లేఖనాలను అన్వేషించండి

యిర్మియా 18: 4

క్రాస్-రిఫరెన్స్‌లు

" కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వానిచేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరల తీసికొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరియొక కుండ చేసెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

యోనా 1:3

అయితే యెహోవా సన్నిధిలోనుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలెనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి, ప్రయాణమునకు కేవు ఇచ్చి, యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితోకూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను.

యోహాను 15:14

నేను మీ కాజ్ఞాపించువాటిని చేసినయెడల, మీరు నా స్నేహితులై యుందురు.

అపోస్తలులకార్యములు 26:19

కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశమునుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక

యోబు 10:8

నీ హస్తములు నాకు అవయవ నిర్మాణముచేసి నన్ను రూపించియున్నను నీవు నన్ను మింగివేయుచున్నావు.

రోమీయులకు 9:21

ఒక ముద్దలోనుండియే యొక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటిమీద కుమ్మరివానికి అధికారము లేదా?