యిర్మియా 42: 10
క్రాస్-రిఫరెన్స్‌లు
" నేను మీకు చేసిన కీడునుగూర్చి సంతాపమొందియున్నాను, మీరు తొందరపడక యీ దేశములో కాపురమున్నయెడల, పడగొట్టక నేను మిమ్మును స్థాపింతును, పెల్లగింపక నాటెదను. "
సంబంధిత రిఫరెన్స్‌లు
మేము ఎంత కొంచెము మంది మిగిలియున్నామో నీవు చూచుచున్నావు గదా? చిత్తగించి మా విన్నపమును నీ సన్నిధికి రానిచ్చి, శేషించియున్న మా యందరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయుము.
జీవముగల దేవుని దూషించుటకై అష్షూరు రాజైన తన యజమానునిచేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలన్నియు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి, నీ దేవుడైన యెహోవాకు వినబడియున్న ఆ మాటలనుబట్టి ఆయన అష్షూరు రాజును గద్దించునేమో కాబట్టి నిలిచిన శేషముకొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము.
యెషయా వారితో ఇట్లనెను మీ యజమానునికి ఈ మాట తెలియజేయుడి యెహోవా సెలవిచ్చునదేమనగా అష్షూరు రాజు పనివారు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు.
అంతట ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియాయొద్దకు ఈ వర్తమానము పంపెను ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చునదేమనగా అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా యెదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించియున్నాను.
అతనిగూర్చి యెహోవా సెలవిచ్చుమాట యేదనగా సీయోను కుమారియైన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది; నిన్ను అపహాస్యము చేయుచున్నది; యెరూషలేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది.
నీవు ఎవనిని తిరస్కరించితివి? ఎవనిని దూషించితివి? నీవు గర్వించి యెవనిని భయపెట్టితివి?
ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవునినే గదా నీ దూతలచేత యెహోవాను తిరస్కరించి పలికించిన మాటలు ఇవే గదా.నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖరములకును లెబానోను పార్శ్వములకును ఎక్కియున్నాను ఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్ఠమైన సరళవృక్షములను నరికివేసియున్నాను వాని దూరపు సరిహద్దులలో సత్రములలోనికిని కర్మెలు ఫలవంతములగు క్షేత్రమైన అడవిలోనికిని ప్రవేశించియున్నాను.
నేను త్రవ్వి పరుల నీళ్లు పానము చేసియున్నాను నా అరకాలిచేత నేను దిట్టమైన స్థలముల నదులనన్నిటిని ఎండిపోజేసియున్నాను.
నేనే పూర్వమందే దీని కలుగజేసితిననియు పురాతనకాలమందే దీని నిర్ణయించితిననియు నీకు వినబడలేదా? ప్రాకారములుగల పట్టణములను నీవు పాడు దిబ్బలుగా చేయుట నావలననే సంభవించినది.
కాబట్టి వాటి కాపురస్థులు బలహీనులై జడిసిరి విభ్రాంతినొంది పొలములోని గడ్డివలెను కాడవేయని చేలవలెను అయిరి.
నీవు కూర్చుండుటయు బయలువెళ్లుటయు లోపలికి వచ్చుటయు నామీదవేయు రంకెలును నాకు తెలిసేయున్నవి.
నామీద నీవు వేయు రంకెలును నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను గనుక నా గాలమును నీ ముక్కునకు తగిలించెదను. నా కళ్లెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను. నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను.
మరియు యెషయా చెప్పినదేమనగా హిజ్కియా, నీకిదే సూచనయగును. ఈ సంవత్సరమందు దానంతట అదే పండు ధాన్యమును, రెండవ సంవత్సరమందు దానినుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు, మూడవ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు; ద్రాక్షతోటలు నాటి వాటిఫలము అనుభవించుదురు.
యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును.
శేషించువారు యెరూషలేములోనుండి బయలుదేరుదురు; తప్పించుకొనినవారు సీయోను కొండలోనుండి బయలుదేరుదురు; సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తి దీని నెరవేర్చును.
కాబట్టి అష్షూరు రాజునుగూర్చి యెహోవా సెలవిచ్చునదేమనగా అతడు ఈ పట్టణములోనికి రాడు; దానిమీద ఒక బాణమైన ప్రయోగింపడు; ఒక కేడెమునైన దానికి కనుపరచడు; దానియెదుట ముట్టడిదిబ్బ కట్టడు.
ఈ పట్టణములోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును; ఇదే యెహోవా వాక్కు.
నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును.
ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి లక్ష యెనుబదియయిదు వేలమందిని హతముచేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరును మృతకళేబరములై యుండిరి.
అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నీనెవె పట్టణమునకు
వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రెమ్మెలెకును షరెజెరును ఖడ్గముతో అతని చంపి అరారాతు దేశములోనికి తప్పించుకొని పోయిరి; అప్పుడు అతని కుమారుడైన ఏసర్హద్దోను అతనికి మారుగా రాజాయెను.
ఈమె వారితో ఇట్లనెను మిమ్మును నాయొద్దకు పంపినవానితో ఈ మాట తెలియజెప్పుడి
యెహోవా సెలవిచ్చునదేమనగా యూదా రాజు చదివించిన గ్రంథములో వ్రాయబడియున్న కీడంతటిని ఏదియు విడిచిపెట్టకుండ నేను ఈ స్థలముమీదికిని దాని కాపురస్థులమీదికిని రప్పింతును.
ఈ జనులు నన్ను విడిచి యితరదేవతలకు ధూపము వేయుచు, తమ సకల కార్యములచేత నాకు కోపము పుట్టించియున్నారు గనుక నా కోపము ఆరిపోకుండ ఈ స్థలముమీద రగులుకొనుచున్నది.
యెహోవాయొద్ద విచారణ చేయుటకై మిమ్మును పంపిన యూదా రాజునకు ఈ మాట తెలియపరచుడి
ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఈ స్థలము పాడగుననియు, దాని కాపురస్థులు దూషణాస్పదులగుదురనియు, నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి, మెత్తని మనస్సుకలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి, నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించియున్నాను.
నేను నిన్ను నీ పితరులయొద్ద చేర్చుదును; నీవు నెమ్మది నొందినవాడవై సమాధికి చేర్చబడుదువు. నేను ఈ స్థలముమీదికి రప్పింపబోవు కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు; ఇదే యెహోవా వాక్కు. అంతట వారు ఈ వర్తమానమును రాజునొద్దకు తెచ్చిరి.
యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీయొద్దకు పంపబడినవారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికేలాగు చేర్చుకొనునో ఆలాగే నేనును నీ పిల్లలను ఎన్నోమారులు చేర్చుకొనవలెనని యుంటిని గాని మీరు ఒల్లకపోతిరి.