లేఖనాలను అన్వేషించండి

యిర్మియా 42: 13

క్రాస్-రిఫరెన్స్‌లు

" అయితే మీరు మీ దేవుడైన యెహోవా మాట విననివారై యీ దేశమందు కాపురముండకమనము ఐగుప్తు దేశమునకు వెళ్లుదము, "

సంబంధిత రిఫరెన్స్‌లు

నెహెమ్యా 1:11

యెహోవా చెవి యొగ్గి నీ దాసుడనైన నా మొఱ్ఱను, నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించు నీ దాసుల మొఱ్ఱను ఆలకించి, ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి, ఈ మనుష్యుడు నాయందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలుకొనుచున్నాను, అని ప్రార్థించితిని. నేను రాజునకు గిన్నె అందించువాడనై యుంటిని.

కీర్తనలు 106:45

వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసికొనెను తన కృపాబాహుళ్యమునుబట్టి వారిని కరుణించెను.

కీర్తనలు 106:46

వారిని చెరగొనిపోయిన వారికందరికి వారియెడల కనికరము పుట్టించెను.

సామెతలు 16:7

ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును.

కీర్తనలు 85:7

యెహోవా, నీ కృప మాకు కనుపరచుము నీ రక్షణ మాకు దయచేయుము.