యిర్మియా 44: 14
క్రాస్-రిఫరెన్స్‌లు
" కావున తాము మరలివచ్చి యూదా దేశములో కాపురముండవలెనన్న మక్కువచేత ఐగుప్తులో ఆగుటకై అక్కడికి వెళ్లు యూదా వారిలోని శేషము ఎవరును తప్పించుకొనరు, శేషమేమియు ఉండదు, పారిపోవువారు గాక మరి ఎవరును తిరిగిరారు. "
సంబంధిత రిఫరెన్స్‌లు
మేలు చేయుటకు కాక కీడు చేయుటకే నేను వారిని కనిపెట్టుచున్నాను; వారు ఖడ్గము చేతనైనను క్షామము చేతనైనను క్షీణించిపోవుచు, ఐగుప్తు దేశములోనున్న యూదావారందరు శేషములేకుండ చత్తురు.
ఖడ్గము తప్పించుకొనువారు కొద్దిమందియై ఐగుప్తు దేశములోనుండి యూదా దేశమునకు తిరిగివచ్చెదరు, అప్పడు ఐగుప్తు దేశములో కాపురముండుటకు వెళ్లిన యూదావారిలో శేషము ఎవరి మాట నిలకడగా నుండునో, నాదో తమదో అది తెలిసికొందురు.
సైన్యములకధిపతియగు యెహోవా వారినిగూర్చి సెలవిచ్చునదేమనగా నేను వారిని శిక్షింపబోవుచున్నాను, వారి యౌవనులు ఖడ్గముచేత చంపబడెదరు, వారి కుమారులును కూమార్తెలును క్షామమువలన చచ్చెదరు;
ఈ పట్టణములో నిలుచువారు కత్తివలనగాని క్షామమువలనగాని తెగులువలనగాని చచ్చెదరు, మేలుచేయుటకు కాదు కీడుచేయుటకే నేను ఈ పట్టణమునకు అభిముఖుడనైతిని గనుక బయటకు వెళ్లి మిమ్మును ముట్టడి వేయుచున్న కల్దీయులకు లోబడువారు బ్రదుకుదురు; దోపుడుసొమ్ము దక్కినట్లుగా వారి ప్రాణము వారికి దక్కును.
నేను వారికిని వారి పితరులకును ఇచ్చిన దేశములో ఉండకుండ వారు పాడైపోవువరకు నేను ఖడ్గమును క్షామమును తెగులును వారిలోకి పంపెదను.
ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడునా కోప మును నా ఉగ్రతయు యెరూషలేము నివాసుల మీదికి వచ్చినట్లు, మీరు ఐగుప్తునకు వెళ్లినయెడల నా ఉగ్రత మీమీదికిని వచ్చును, మీరు శాపాస్పదముగాను భీతి పుట్టించువారుగాను దూషణాస్పదముగాను తిరస్కరింపబడువారుగాను ఉందురు, ఈ స్థలమును మరి యెప్పుడును చూడరు.
అతడువచ్చి తెగులునకు నిర్ణయమైన వారిని తెగులునకును, చెరకు నిర్ణయమైనవారిని చెరకును, ఖడ్గమునకు నిర్ణయమైనవారిని ఖడ్గమునకును అప్పగించుచు ఐగుప్తీయులను హతము చేయును.
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఈ పట్టణము నిశ్చయముగా బబులోనురాజు దండుచేతికి అప్పగింపబడును, అతడు దాని పట్టుకొనును అని యిర్మీయా ప్రజలకందరికి ప్రకటింపగా
మీరు భయపడుచున్న ఖడ్గము అక్కడను ఐగుప్తు దేశముననే మిమ్మును తరిమి పట్టుకొనును; మీకు భయము కలుగజేయు క్షామము ఐగుప్తులోనే మిమ్మును తరిమి కలిసికొనును, అక్కడనే మీరు చత్తురు,
మీరు ఖడ్గమునకు భయపడుచున్నారే, నేనే మీమీదికి ఖడ్గము రప్పించెదను; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.