యిర్మియా 44: 25
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఇశ్రాయేలు దేవుడును, సైన్యములకధిపతియునగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఆకాశరాణికి ధూపము వేయుదుమనియు, ఆమెకు పానార్పణములు అర్పింతుమనియు, మేము మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను నిశ్చయముగా నెరవేర్చుదుమనియు మీరును మీ భార్యలును మీ నోటితో పలికి మీచేతులతో నెరవేర్చుచున్నారే; నిజముగానే మీ మ్రొక్కుబళ్లను మీరు మ్రొక్కుదురు, నిజముగానే మీ మ్రొక్కులను మీరు నెరవేర్తురు. "
సంబంధిత రిఫరెన్స్‌లు
మహా సమాజముగా కూడినవారును ఐగుప్తు దేశమందలి పత్రోసులో కాపురముండు జనులందరును యిర్మీయాకు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చిరి యెహోవా నామమునుబట్టి నీవు మాకు ప్రకటించు ఈ మాటను మేమంగీకరింపము,
యూదావారిలో శేషించినవారలారా, యెహోవా మాట ఆలకించుడి; ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఐగుప్తునకు వెళ్లవలెనని నిశ్చయించుకొని అక్కడనే కాపురముండుటకు మీరు వెళ్లినయెడల
మీకాయా యిట్లనెను యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము; యెహోవా సింహాసనాసీనుడై యుండగా పరలోకసైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడమ పార్శ్వమునను నిలిచియుండుట నేను చూచితిని
సొదొమ న్యాయాధిపతులారా, యెహోవామాట ఆలకించుడి. గొమొఱ్ఱా జనులారా, మన దేవుని ఉపదేశమునకు చెవియొగ్గుడి.
కాబట్టి యెరూషలేములోనున్న యీ జనులను ఏలు అపహాసకులారా, యెహోవా వాక్యము వినుడి
అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకును భయపడకుము. వారు తిరుగుబాటు చేయువారు వారికి భయపడకుము.
యెహోవా మాట ఆలకించుము ఇశ్రాయేలీయులనుగూర్చి ప్రవచింపకూడదనియు ఇస్సాకు సంతతివారినిగూర్చి మాట జారవిడువకూడదనియు నీవు ఆజ్ఞ ఇచ్చుచున్నావే.
వినుటకు చెవులుగలవాడు వినుగాక.
అప్పుడు తమ భార్యలు అన్యదేవతలకు ధూపము వేయుదురని యెరిగియున్న పురుషులందరును, అక్కడ నిలిచియున్న స్త్రీలును,
కాబట్టి ఐగుప్తులో నివసించు సమస్తమైన యూదులారా, యెహోవా మాటవినుడి యెహోవా సెలవిచ్చునదేమనగా ప్రభువగు యెహోవా అను నేను నా జీవముతోడు ప్రమాణము చేయుచు, ఐగుప్తులో నివసించు యూదులలో ఎవరును ఇకమీదట నా నామము నోట పలకరని నా ఘనమైన నామముతోడు నేను ప్రమాణము చేయుచున్నాను.
ఐగుప్తు దేశములో ప్రవేశించిరి. వారు తహపనేసుకు రాగా
అన్యజనులేమి భూమిమీది యే జనులేమి చేయునట్లు మేమును కొయ్యలకును రాళ్లకును పూజచేతుమని మీరనుకొనుచున్నారే. మీరు ఇచ్ఛయించినదాని ప్రకారమెన్నటికిని జరుగదు.
నా జీవముతోడు నా రౌద్రము కుమ్మరించుచు, బాహుబలముతోను చాచిన చేతితోను నేను మీపైన అధికారము చేసెదను.
యాకోబు ఇంటివారలారా, ఇశ్రాయేలు ఇంటివారలారా, మీరందరు యెహోవా వాక్కు వినుడి.
నీవు యెహోవా మందిర ద్వారమున నిలువబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము యెహోవాకు నమస్కారము చేయుటకై యీ ద్వారములలో బడి ప్రవేశించు యూదావారలారా, యెహోవా మాట వినుడి.