యిర్మియా 49: 31
క్రాస్-రిఫరెన్స్‌లు
" మీరు లేచి ఒంటరిగా నివసించుచు గుమ్మములు పెట్టకయు గడియలు అమర్చకయు నిశ్చింతగాను క్షేమముగాను నివసించు జనముమీద పడుడి. "
సంబంధిత రిఫరెన్స్‌లు
ఏశావును విమర్శించుచు నేనతనికి కష్టకాలము రప్పించుచున్నాను; దదానీయులారా, పారిపోవుడి వెనుకకు మళ్లుడి బహులోతున దాగుకొనుడి.
ఈ దేశముమీదికిని దీని నివాసులమీదికిని చుట్టునున్న యీ జనులందరి మీదికిని వారిని రప్పించుచున్నాను; ఈ జనులను శాపగ్రస్తులగాను విస్మయాస్పదముగాను అపహాస్యాస్పదముగాను ఎప్పటికిని పాడుగాను ఉండజేసెదను.
అరబిదేశపు రాజులందరును అరణ్యములో నివసించు మిశ్రితజనముల రాజులందరును
జిమీ రాజులందరును ఏలాము రాజులందరును మాదీయుల రాజులందరును
ఇప్పుడైతే దేశములన్నిటిని నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్రెజరు వశము చేయుచున్నాను; అతని సేవించుటకై భూజంతువులనుకూడ అతని వశము చేయుచున్నాను.
అయితే అతడు ఆలాగనుకొనడు అది అతని ఆలోచనకాదు; నాశనము చేయవలెననియు చాల జనములను నిర్మూలము చేయవలెననియు అతని ఆలోచన.
బబులోను రాజైన నెబుకద్రెజరు కొట్టిన కేదారును గూర్చియు హాసోరు రాజ్యములనుగూర్చియు యెహోవా సెలవిచ్చినమాట లేచి కేదారునకు వెళ్లుడి తూర్పుదేశస్థులను దోచుకొనుడి.