లేఖనాలను అన్వేషించండి

యిర్మియా 49: 38

క్రాస్-రిఫరెన్స్‌లు

" నా సింహాసనమును అచ్చటనే స్థాపించి ఏలాములోనుండి రాజును అధిపతులను నాశనము చేయుదును; ఇదే యెహోవా వాక్కు."

సంబంధిత రిఫరెన్స్‌లు

యిర్మియా 49:5

నీ లోయలో జలములు ప్రవహించుచున్నవని, నీవేల నీ లోయలనుగూర్చి యతిశయించుచున్నావు? ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు

యిర్మియా 49:22

శత్రువు పక్షిరాజువలె లేచి యెగిరి బొస్రామీద పడవలెనని తన రెక్కలు విప్పుకొనుచున్నాడు; ఆ దినమున ఎదోము బలాఢ్యుల హృదయములు ప్రసవించు స్త్రీ హృదయమువలె ఉండును.

యిర్మియా 49:24

దమస్కు బలహీనమాయెను. పారిపోవలెనని అది వెనుకతీయుచున్నది వణకు దానిని పట్టెను ప్రసవించు స్త్రీని పట్టునట్లు ప్రయాసవేదనలు దానిని పట్టెను.

యిర్మియా 49:29

వారి గుడారములను గొఱ్ఱల మందలను శత్రువులు కొనిపోవుదురు తెరలను ఉపకరణములను ఒంటెలను వారు పట్టుకొందురు నఖముఖాల భయమని వారు దానిమీద చాటింతురు

యిర్మియా 48:39

అంగలార్చుడి మోయాబు సమూల ధ్వంసమాయెను మోయాబూ, నీవు వెనుకకు తిరిగితివే, సిగ్గుపడుము. మోయాబు తన చుట్టునున్న వారికందరికి అపహాస్యాస్పదముగాను భయకారణముగాను ఉండును.

యిర్మియా 50:36

ప్రగల్భములు పలుకువారు ఖడ్గవశులై పిచ్చివాండ్రగుదురు. బలాఢ్యులు నిర్మూలమగువరకు ఖడ్గము వారిమీద పడును

కీర్తనలు 48:4

రాజులు కూడిరి వారు ఏకముగా కూడివచ్చిరి.

కీర్తనలు 48:5

వారు దాని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి భ్రమపడి త్వరగా వెళ్లిపోయిరి.

కీర్తనలు 48:6

వారచ్చటనుండగా వణకును ప్రసవించు స్త్రీ వేదనయు వారిని పట్టెను.

యెహెజ్కేలు 32:23

దాని సమాధులు పాతాళాగాధములో నియమింపబడినవి, దాని సమూహము దాని సమాధిచుట్టు నున్నది, వారందరు సజీవుల లోకములో భయంకరులైన వారు, వారు కత్తిపాలై చచ్చిపడియుండిరి.

యిర్మియా 34:20

వారి శత్రువులచేతికిని వారి ప్రాణము తీయజూచువారి చేతికిని వారి నప్పగించుచున్నాను, వారి కళేబరములు ఆకాశ పక్షులకును భూమృగములకును ఆహారముగా నుండును.

యిర్మియా 34:21

యూదారాజైన సిద్కియాను అతని అధిపతులను వారి శత్రువులచేతికిని వారి ప్రాణము తీయజూచువారిచేతికిని మీయొద్దనుండి వెళ్ళిపోయిన బబులోను రాజు దండుచేతికిని అప్పగించుచున్నాను.

యిర్మియా 9:16

తామైనను తమ పితరులైనను ఎరుగని జనములలోనికి వారిని చెదరగొట్టుదును, వారిని నిర్మూలము చేయువరకు వారి వెంబడి ఖడ్గమును పంపుదును.

యిర్మియా 48:2

హెష్బోనులో వారు అది ఇకను జనము కాకపోవునట్లు దాని కొట్టివేయుదము రండని చెప్పుకొనుచు దానికి కీడు చేయనుద్దేశించుచున్నారు మద్మేనా, నీవును ఏమియు చేయలేకపోతివి. ఖడ్గము నిన్ను తరుముచున్నది.

లేవీయకాండము 26:33

జనములలోనికి మిమ్మును చెదరగొట్టి మీవెంట కత్తి దూసెదను, మీ దేశము పాడైపోవును, మీ పట్టములు పాడుపడును.

యెహెజ్కేలు 5:2

పట్టణమును ముట్టడివేసిన దినములు సంపూర్ణమైనప్పుడు నీవు పట్టణములో వాటి మూడవ భాగమును కాల్చి, రెండవ భాగమును తీసి ఖడ్గముచేత హతముచేయు రీతిగా దానిని చుట్టు విసిరికొట్టి మిగిలిన భాగము గాలికి ఎగిరిపోనిమ్ము; నేను ఖడ్గముదూసి వాటిని తరుముదును.

యెహెజ్కేలు 5:12

కరవు వచ్చియుండగా నీలో మూడవ భాగము తెగులుచేత మరణమవును, మూడవ భాగము ఖడ్గముచేత నీ చుట్టు కూలును, నేను కత్తి దూసి మిగిలిన భాగమును నలుదిశల చెదరగొట్టి తరుముదును.

యెహెజ్కేలు 12:14

మరియు వారికి సహాయులై వచ్చినవారినందరిని అతని దండువారినందరిని నేను నలుదిక్కుల చెదరగొట్టి కత్తిదూసి వారిని తరిమెదను