యిర్మియా 52: 15
క్రాస్-రిఫరెన్స్‌లు
" మరియు రాజ దేహసంరక్షకుల యధిపతియైన నెబూజరదాను ప్రజలలో కడుబీదలైన కొందరిని, పట్టణములో శేషించిన కొదువ ప్రజలను, బబులోనురాజు పక్షము చేరినవారిని, గట్టి పనివారిలో శేషించినవారిని చెరగొనిపోయెను. "
సంబంధిత రిఫరెన్స్‌లు
మరియు రాజదేహసంరక్షకుల అధిపతియొద్దనున్న కల్దీయుల సైనికులందరును యెరూషలేము చుట్టునున్న ప్రాకారములను పడగొట్టిరి.
వారు చెరపట్టబడినవారిలో శేషించినవారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు; మరియు యెరూషలేముయొక్క ప్రాకారము పడద్రోయబడినది; దాని గుమ్మములును అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి.
ఈ ప్రకారము ఇశ్రాయేలీయులందరును తమ వంశములచొప్పున సరిచూడబడిన మీదట వారి పేళ్లు ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడెను. యూదా వారు చేసిన ద్రోహమునకై వారు బాబెలునకు చెరగొనిపోబడిరి.
అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగులబెట్టి, యెరూషలేము ప్రాకారమును పడగొట్టి, దానియొక్క నగరులన్నిటిని కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటిని బొత్తిగా పాడుచేసిరి.
నిరాకారమైన పట్టణము నిర్మూలము చేయబడెను ఎవడును ప్రవేశింపకుండ ప్రతి యిల్లు మూయబడియున్నది.
కల్దీయులు రాజనగరును ప్రజల యిండ్లను అగ్నిచేత కాల్చివేసి యెరూషలేము ప్రాకారములను పడగొట్టిరి.
అయిదవ నెల పదియవ దినమున, అనగా బబులోను రాజైన నెబుకద్రెజరు ఏలుబడియందు పందొమ్మిదవ సంవత్సరమున బబులోను రాజు ఎదుట నిలుచు నెబూజరదానను రాజదేహసంరక్షకుల యధిపతి యెరూషలేమునకు వచ్చెను.
పట్టణపు గవునులు భూమిలోనికి క్రుంగిపోయెను దాని అడ్డగడియలను ఆయన తుత్తునియలుగా కొట్టి పాడుచేసెను దాని రాజును అధికారులును అన్యజనులలోనికి పోయియున్నారు అచ్చట వారికి ధర్మశాస్త్రము లేకపోయెను యెహోవా ప్రత్యక్షత దాని ప్రవక్తలకు కలుగుటలేదు.
అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజ దేహసంరక్షకుల యధిపతియగు అర్యోకు దగ్గరకు పోయి, జ్ఞానయుక్తముగా మనవి చేసెను