యిర్మియా 52: 6
క్రాస్-రిఫరెన్స్‌లు
" నాల్గవ నెల తొమ్మిదవ దినమున క్షామము పట్టణములో హెచ్చుగా నున్నప్పుడు దేశ ప్రజలకు ఆహారము లేకపోయెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
అష్షూరు రాజు దేశమంతటిమీదికిని షోమ్రోనుమీదికిని వచ్చి మూడు సంవత్సరములు షోమ్రోనును ముట్టడించెను.
అతని యేలుబడిలో తొమ్మిదవ సంవత్సరమందు పదియవ మాసము పదియవ దినమందు బబులోను రాజైన నెబుకద్నెజరును అతని సైన్యమంతయును యెరూషలేము మీదికి వచ్చి దానికెదురుగా దిగి దాని చుట్టును ముట్టడిదిబ్బలు కట్టిరి.
యూదా రాజైన సిద్కియా యేలుబడి పదియవ సంవత్సరమున, అనగా నెబుకద్రెజరు ఏలుబడి పదునెనిమిదవ సంవత్సరమున యెహోవా యొద్దనుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు.
మరియు పదకొండవ సంవత్సరము మూడవ నెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.