యోబు 24: 19
క్రాస్-రిఫరెన్స్‌లు
" అనావృష్టిచేతను ఉష్ణముచేతను మంచునీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసినవారిని పట్టుకొనును."
సంబంధిత రిఫరెన్స్‌లు
నా స్నేహితులు ఎండిన వాగువలెను మాయమైపోవు జలప్రవాహములవలెను నమ్మకూడని వారైరి.
మంచుగడ్డలుండుటవలనను హిమము వాటిలో పడుటవలనను అవి మురికిగా కనబడును
వేసవి రాగానే అవి మాయమైపోవును వెట్ట కలుగగానే అవి తమ స్థలమును విడిచి ఆరిపోవును.
ఒకడు తన కడవలలో పాలు నిండియుండగను తన యెముకలలో మూలుగ బలిసియుండగను
వారు సమాధికి తేబడుదురు సమాధి శ్రద్ధగా కావలి కాయబడును
పల్లములోని మంటి పెల్లలు వారికి ఇంపుగానున్నవి మనుష్యులందరు వారివెంబడి పోవుదురు ఆలాగుననే లెక్క లేనంతమంది వారికి ముందుగా పోయిరి.
మీరు చెప్పు ప్రత్యుత్తరములు నమ్మదగినవి కావు ఇట్టి నిరర్థకమైన మాటలతో మీరేలాగు నన్ను ఓదార్చ జూచెదరు?
వారు పాతాళములో మందగా కూర్చబడుదురు మరణము వారికి కాపరియైయుండును ఉదయమున యథార్థవంతులు వారినేలుదురు వారి స్వరూపములు నివాసములేనివై పాతాళములో క్షయమైపోవును.
వారు కరగిపోయిన నత్తవలె నుందురు సూర్యుని చూడని గర్భస్రావమువలె నుందురు.
మీ కుండలకు ముళ్లకంపల సెగ తగలకమునుపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దాని నెగరగొట్టుచున్నాడు,
పొగ చెదరగొట్టబడునట్లు నీవు వారిని చెదరగొట్టుము అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరగి నశించుదురు గాక.
అపాయము రాగా భక్తిహీనుడు నశించును మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు.
బ్రదికియుండువారితో కలిసిమెలిసి యున్నవారికి ఆశ కలదు; చచ్చిన సింహముకంటె బ్రదికియున్న కుక్క మేలు గదా.
బ్రదికియుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు; వారిపేరు మరువబడియున్నది, వారికిక ఏ లాభమును కలుగదు.
వారిక ప్రేమింపరు, పగ పెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేనియందును వారికిక నెప్పటికిని వంతు లేదు.
అయితే దేవుడు వెఱ్ఱివాడా, యీ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు; నీవు సిద్ధపరచినవి ఎవనివగునని ఆతనితో చెప్పెను.
ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతలచేత అబ్రాహాము రొమ్మున (ఆనుకొనుటకు) కొనిపోబడెను. ధనవంతుడు కూడ చనిపోయి పాతిపెట్టబడెను.
నీ మహాత్మ్యమును నీ స్వరమండలముల స్వరమును పాతాళమున పడవేయబడెను. నీ క్రింద పురుగులు వ్యాపించును కీటకములు నిన్ను కప్పును.